ఆర్టీసీ ఆస్పత్రిలో మందుల కొరత
మూడు నెలలుగా ఇదే పరిస్థితి కార్మిక కుటుంబాలు ఎదురుచూపులు
రాష్ట్రం మొత్తంలోనే ఏకైక ఆర్టీసీ జోనల్ ఆస్పత్రి అది. ఐదు జిల్లాల ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన వైద్య సేవలందించాలి. అలాంటి కరీంనగర్ జోనల్ ఆస్పత్రిని మందుల కొరత వెంటాడుతోంది. ఆస్పత్రికి సరిపడా మందులు సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. - మంకమ్మతోట
ఆర్టీసీ కరీంనగర్ జోనల్ ఆస్పత్రికి గతంలో కావాల్సిన మందులన్నీ నెలలో ఒకేసారి సరఫరా అయ్యేవి. ఇప్పుడు మందుల కోసం అధికారులు రెండు,మూడు సార్లు హైదరాబాద్‌లోని ఆర్టీసీ సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌కు వెళ్లాల్సివస్తోంది. ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వ్యాధులకు మందులు అందుబాటులో ఉంటున్నా అవి సరిపడా సరఫరా కావడం లేదు. కొత్తకొత్త కంపెనీలకు చెందిన మందులు ఇస్తున్నారని, ప్రతినెల మందుల కంపెనీలు మారుతుండడంతో తాము ఏ మందులు వేసుకుంటున్నామో తెలియని పరిస్థితి నెలకొందని కార్మికులు, వారి కుటుంబసభ్యులు అంటున్నారు. బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఇక్కడ నెలకు ఒకేసారి మందులు ఇస్తుంటారు. మందులు వచ్చినట్లు తెలియగానే వెంటనే వెళ్లాలి. లేకుంటే అవి ముందుగా వచ్చిన వారికి ఇస్తున్నారు. దీంతో ఆలస్యంగా వెళ్లిన వారికి వేరే కంపెనీలు, ఎంజీ తక్కువ, ఎక్కువగా ఉన్న మందులు ఇస్తున్నారని అంటున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ల్యాబ్‌లో వైరల్ ఫీవర్ రక్తపరీక్షల కిట్లు కూడా అందుబాటులోలేవని సమాచారం.
ఐదు జిల్లాల కార్మికులకు సేవలు
రాష్ట్రం మొత్తంలోనే ఏకైక ఆర్టీసీ జోనల్ ఆస్పత్రి కరీంనగర్‌లో ఉంది. కరీంనగర్ జోన్‌లో ఏడు వేల మంది కార్మికులు సహా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన కార్మికుల కుటుంబాలకు సేవలు అందించాల్సి ఉంది. ఇక్కడ వారికి సంపూర్ణ వైద్యం అందడం లేదనే ఆరోపణలున్నాయి. రోజు ఈ ఆస్పత్రికి 130 నుంచి 150 మంది వరకు వైద్య సేవల కోసం వస్తుంటారు. దీంతో ప్రతినెల 100కు పైగా కేసులను ఆర్టీసీతో ైటె అప్‌గా ఉన్న ప్రతిమ హాస్పిటల్‌కు పంపిస్తున్నారు. ఉన్న ఆస్పత్రిలోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తే రోగులకు ఇబ్బందులు తొలగడమే కాకుండా లక్షలాది రూపాయలు ఆదా అవుతాయని కార్మికులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఆర్టీసీ కరీంనగర్ జోనల్ ఆస్పత్రికి గతంలో కావాల్సిన మందులన్నీ నెలలో ఒకేసారి సరఫరా అయ్యేవి. ఇప్పుడు మందుల కోసం అధికారులు రెండు,మూడు సార్లు హైదరాబాద్‌లోని ఆర్టీసీ సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌కు వెళ్లాల్సివస్తోంది. ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వ్యాధులకు మందులు అందుబాటులో ఉంటున్నా అవి సరిపడా సరఫరా కావడం లేదు.
కొత్తకొత్త కంపెనీలకు చెందిన మందులు ఇస్తున్నారని, ప్రతినెల మందుల కంపెనీలు మారుతుండడంతో తాము ఏ మందులు వేసుకుంటున్నామో తెలియని పరిస్థితి నెలకొందని కార్మికులు, వారి కుటుంబసభ్యులు అంటున్నారు. బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఇక్కడ నెలకు ఒకేసారి మందులు ఇస్తుంటారు. మందులు వచ్చినట్లు తెలియగానే వెంటనే వెళ్లాలి. లేకుంటే అవి ముందుగా వచ్చిన వారికి ఇస్తున్నారు. దీంతో ఆలస్యంగా వెళ్లిన వారికి వేరే కంపెనీలు, ఎంజీ తక్కువ, ఎక్కువగా ఉన్న మందులు ఇస్తున్నారని అంటున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ల్యాబ్‌లో వైరల్ ఫీవర్ రక్తపరీక్షల కిట్లు కూడా అందుబాటులోలేవని సమాచారం.
ఐదు జిల్లాల కార్మికులకు సేవలు
రాష్ట్రం మొత్తంలోనే ఏకైక ఆర్టీసీ జోనల్ ఆస్పత్రి కరీంనగర్‌లో ఉంది. కరీంనగర్ జోన్‌లో ఏడు వేల మంది కార్మికులు సహా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన కార్మికుల కుటుంబాలకు సేవలు అందించాల్సి ఉంది. ఇక్కడ వారికి సంపూర్ణ వైద్యం అందడం లేదనే ఆరోపణలున్నాయి. రోజు ఈ ఆస్పత్రికి 130 నుంచి 150 మంది వరకు వైద్య సేవల కోసం వస్తుంటారు. దీంతో ప్రతినెల 100కు పైగా కేసులను ఆర్టీసీతో ైటె అప్‌గా ఉన్న ప్రతిమ హాస్పిటల్‌కు పంపిస్తున్నారు. ఉన్న ఆస్పత్రిలోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తే రోగులకు ఇబ్బందులు తొలగడమే కాకుండా లక్షలాది రూపాయలు ఆదా అవుతాయని కార్మికులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.