
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో పరీక్షా కేంద్రాల జంబ్లింగ్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. దీనిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో కాలేజీలు నడిపిన వారికి నోటీసులు జారీ చేశామన్నారు.
ప్రైవేటు కాలేజీల్లోనూ కౌన్సిలర్లు
ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడి గురవుతున్నారని, ప్రైవేటు కాలేజీల్లో కూడా కౌన్సిలర్ల వ్యవస్థ ఉండాలని మంత్రి సబిత అన్నారు. నాంపల్లిలోని వనిత మహా విద్యాలయ ఆడిటోరియంలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకై జూనియర్ కళాశాలల్లో నియమితులైన కౌన్సిలర్ల రెండు రోజుల శిక్షణ శిబిరాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు.