మొన్నటి వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం విద్యుత్‌శాఖ మంత్రిగా చేస్తున్న గుంటకండ్ల జగదీష్‌రెడ్డి స్వగ్రామం నాగారంలో ఆయన చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాత భవనం కాలం తీరిపోయి పూర్తిగా శిధిలమై ఏక్షణంలోనైనా కూలే దశకు చేరింది.
నల్లగొండ(అర్వపలి):మొన్నటి వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం విద్యుత్‌శాఖ మంత్రిగా చేస్తున్న గుంటకండ్ల జగదీష్‌రెడ్డి స్వగ్రామం నాగారంలో ఆయన చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాత భవనం కాలం తీరిపోయి పూర్తిగా శిధిలమై ఏక్షణంలోనైనా కూలే దశకు చేరింది. అయితే ఈభవనంనకు కాలంతీరి పోవడంతో పక్కనేకొత్త భవనాన్ని నిర్మించారు. అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈశిధిలమైన గదులను వెంటనే తొలగించాల్సి ఉండగా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంతో పిల్లలు క్షణమో యుగంగా గడుపుతున్నారు.
గత ఏడాది విద్యాశాఖ మంత్రి హోదాలో తాను చిన్ననాడు చదువుకున్న పాఠశాలలో జగదీష్‌రెడ్డి సందర్శించారు. శిధిలమైన భవనాన్ని చూశారు. ఈభవనాన్ని వెంటనే తొలగించి వేయాలని ఉపాధ్యాయులు వినతి పత్రాన్ని కూడా ఆయనకు ఇచ్చారు. జడ్పీ లేదా మరే పథకంలోనైనా నిధులు మంజూరు చేయించి పాడుబడిన భవనాన్ని తొలగించి వేయిస్తానని హామీ ఇచ్చినా ఇంత వరకు తీరలేదు. ఈభవనం సమీపం నుంచి పాఠశాలకు పిల్లలు నడిచి వస్తారు. భవనం కూలి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.