
సెమినార్‌లో మాట్లాడుతున్న బృందాకారత్
దురాజ్‌పల్లి (సూర్యాపేట): మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజలను విడగొట్టే విధంగా దేశంలో బీజేపీ పాలన సాగుతోందని, దీనికి వ్యతిరేకంగా లౌకికవాదులు ఏకం కావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పిలుపునిచ్చారు.
సీపీఎం 22వ అఖిల భారత మహాసభల సన్నాహాల్లో భాగంగా ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఆమె మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ విధానాలు, మను సిద్ధాంతాన్ని పాటిస్తూ లౌకికవాదాన్ని మంటగలుపుతోం దని ఆరోపించారు. తద్వారా జాతీయ సమగ్రతను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment