గాగిళ్ళాపూర్(మద్దూరు) : అప్రకటిత కరెంటు కోతలను నివారించి వ్యవసాయానికి ఏడు గంటల నిరంతర విద్యత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని నర్సాయపల్లి, గాగిళ్లాపూర్ గ్రామాలకు చెందిన రైతులు సోమవారం గాగిళ్లాపూర్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అప్పులు చేసి సాగు చేసిన పంటలు అప్రకటిత కరెంట్ కోతలతో నీరందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా చేయగా ప్రస్తుతం రెండు గంటల కూడా ఉండడం లేదన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన విధంగానైనా ఐదు గంటల విద్యుత్‌ను కోతలు లేకుండా నిరంతరంగా సరఫరా చేయాలం టూ సబ్‌స్టేషన్ ఆపరేటర్ మల్లారపు అశోక్ ను నిలదీశారు. మద్దూరు ఏఈఈ నాగేం దర్ తమ గోడు పట్టించుకోవడం లేదని, అందుకే అతను ఇక్కడికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ కమింగ్ కటింగ్ సమాయాన్ని తిరిగి కలపాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. మండలంలోని లద్నూరు ఎస్‌ఎస్ 6 ట్రాన్‌ఫార్మర్ కాలిపోగా మూడు సార్లు మరమతులు చేసి బిగించినా 20 రోజుల నుంచి ట్రాన్స్‌ఫార్మర్ పనిచేయడం లేదు. దీంతో రైతులు ట్రాన్స్‌ఫార్మవద్ద నిరసన తెలిపారు. జనగామ డీఈఈ వారితో మాట్లాడి మరో ట్రాన్స్ ఫార్మర్‌ను సాయంత్రం వరకు పంపిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కార్యక్రమంలో రెండు గ్రామాల రైతులు ప్రభాకర్‌రెడ్డి, వెంకట్ నారాయణ, బండి కిష్టయ్య, మంద బాలయ్య, లక్ష్మణ్, బాలమల్లు, క్రిష్ణారెడ్డి, దాసరి పద్మారెడ్డి, రేకుల నర్సయ్య, పుట్ట ప్రభాకర్, బంగ్ల భాస్కర్, చంద్రం, కాసర్ల కిష్టయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలి
Published Tue, Aug 26 2014 2:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement