ప్రజల గుండెల్లో వైఎస్ | sharmila paramarsha yatra 21th Nalgonda district | Sakshi
Sakshi News home page

ప్రజల గుండెల్లో వైఎస్

Published Wed, Jan 14 2015 3:26 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

ప్రజల గుండెల్లో వైఎస్ - Sakshi

ప్రజల గుండెల్లో వైఎస్

దేవరకొండ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రజలకున్న అభిమానం శాశ్వతమైనదని, అది ఎప్పటికీ చెరిగిపోనిదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఐబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన హయాంలో ప్రజాసంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి.. నిరాటంకంగా సేవలందించిన మహానేత వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైఎస్ తనయుడు, తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పుయాత్రలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఆయన సోదరి షర్మిల పరామర్శ యాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
 
 ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే యాత్ర మొద ట నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుందని స్పష్టంచేశారు. వైఎస్ మృతితో దిగ్భ్రాంతికి గురై జిల్లా వ్యాప్తంగా మృతి చెందిన 32 మందికి చెందిన బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నట్లు చెప్పారు. పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎం పీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆమె యాత్రలో పాల్గొంటారని తెలిపారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇరుగు సునీ ల్‌కుమార్, పార్టీ నాగార్జునసాగర్ ఇన్‌చార్జ్ మల్లు రవీం దర్‌రెడ్డి, దేవరకొండ నియోజకవర్గ నాయకులు బెదరకోట భాస్కర్, డిండి మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, సిరాజ్, రాయపరెడ్డి, యూసూఫ్, లోహిత్‌రెడ్డి, లక్ష్మీపతి, కాసర్ల వెంకట య్య, పుప్పాల పాండు, పచ్చిపాల వెంకటయ్య ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement