గని కార్మికులకు ఐటీ నిరాశ
- ఐటీ పరిమితి రూ.2.5 లక్షలే
- అందరికీ ఆదాయ పన్ను వర్తింపు
- రూ.5 లక్షల వరకు ఆశించి భంగపడిన కార్మికులు
- కేంద్ర ప్రభుత్వంపై మండిపాటు
మంచిర్యాల సిటీ : కేంద్ర ప్రభుత్వం గురువారం లోకసభలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ సింగరేణి బొగ్గు గని కార్మికులను నిరాశపర్చింది. కేంద్ర పభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితిని రూ.రెండు లక్షల నుంచి రెండన్నర లక్షల వరకు సవరించింది. దీంతో సింగరేణి లోని 34 భూగర్భ, 15 ఉపరితల గనుల్లో పనిచేస్తున్న 63వేల మంది కార్మికులు అందరూ కూ డా ఆదాయపు పన్ను చెల్లించక తప్పడం లేదు.
ఆశలు అడియాశలు
ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షల వరకు సవరించడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో కార్మికుల్లో ఆ శలు చిగురించాయి. ఐదు లక్షల పరిమితి అమ లు అయితే ఏ ఒక్క కార్మికుడు కూడా ఆదాయ పు పన్ను చెల్లించే పరిస్థితి వచ్చేది కాదు. తె లం గాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందుకు వచ్చిన బీజే పీ కేంద్రంలో మేలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చే సింది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పో షించి సకల జనుల సమ్మెలో సైతం కార్మికులు పాల్గొన్నారు. ఇలా వేతనాలను త్యాగం చేసిన త మపై బీజేపీ ప్రభుత్వం కనికరించకపోవడంపై కార్మిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
అందరికీ ఆదాయ పన్ను
సింగరేణిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 63 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సంస్థలో కొత్తగా నియామకాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కార్మికులు అందరూ కూడా రూ.నాలుగు నుంచి రూ.ఐదు లక్షల పైబడి వార్షిక ఆదాయం పొందుతున్నట్లు సింగరేణి గణాంకాలు చెబుతున్నాయి. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు దాదాపు 20 ఏళ్ల సర్వీసు ఉన్నవారే ఉన్నారు. వీరు నెల వేతనం రూ.35 వేల నుంచి రూ.80 వేల వరకు తీసుకుంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆదాయపు పన్ను పరిమితి గని కార్మికులను నిరాశలోకి తోసివేసిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ పన్ను పరిధిలోకే..
కోల్ ఇండియాలో లేని విధానాన్ని సింగరేణిలో అమలు చేస్తున్నా గుర్తింపు సంఘంతో పాటు, ఇతర కార్మిక సంఘాలు నోరు మెదపడం లేదు. చట్టప్రకారం సాధించుకున్న అలవెన్సులకు కూడా కార్మికులు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. ఇంటి అద్దె, విద్యుత్, నీరు చార్జీలను ఆదాయపు పన్ను కింద లెక్కిస్తున్నారు. వీటితో పాటు యాజమాన్యం చెల్లించే వంట గ్యాస్, ఇన్సెంటివ్, రవాణా తదితర అలవెన్సులను కలిపి వార్షిక ఆదాయం కింద జమ చేయడంతో కార్మికులు తప్పని పరిస్థితుల్లో పన్ను చెల్లించక తప్పడంలేదు. కోల్ ఇండియాలో అలవెన్సుల రూపంలో వచ్చే ఆదాయాన్ని మినహాయించి లెక్కించి పన్ను విధిస్తున్నారు. ప్రతి కార్మికుడికి అలవెన్సుల పేరిట ఏటా వచ్చే ఆదాయం రూ.30 నుంచి రూ.60 వేల వరకు ఉంటుంది. వీటి కి కూడా పన్ను చెల్లించక తప్పడంలేదు.
ఒత్తిడి తీసుకువస్తేనే...
తెలంగాణ ఉద్యమానికి అండగా ఉండి సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులను ఆదాయపు పన్ను భారం నుంచి తప్పించడానికి తెలంగాణ ప్రభుత్వమే ఆదుకోవాలి. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆదాయపు పన్ను రద్దు కోసం ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టి కార్మికుల అభిమానాన్ని సంపాదించుకొంది. కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న నౌక, రక్షణ, విమాన రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆదాయపు పన్ను లేదు. ఈ విధానం అమలు కావాలంటే కోల్ ఇండియాతో ముడిపడి ఉంది. కోల్ ఇండియా ప్రాంత ప్రజాప్రతినిధులతో కోల్‌బెల్ట్ ప్రజాప్రతినిధులు కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తేనే కొంత మేరకు ఫలితం కనబడే అవకాశాలున్నాయి.