* బడ్జెట్‌లో ఓరుగల్లుకు ప్రత్యేక నిధులు
* సాగునీటి మంత్రి హరీశ్‌రావు
హన్మకొండ: ‘వరంగల్ నగరానికి గొప్ప చరిత్ర ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఓరుగల్లు చరిత్ర పూర్తిగా మరుగునపడింది. గత వైభవాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది’ అని సాగునీటి శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో హరీశ్‌రావు ప్రసంగించారు. వరంగల్‌ను విద్యా కేంద్రంగా మార్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. ‘వరంగల్‌లో కాకతీయులు తవ్విన చెరువులే ఉన్నాయి. 65 ఏళ్లలో ఎవరూ కొత్తగా ఒక్క చెరువునూ నిర్మించలేదు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు టీఆర్‌ఎస్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది.
నగరం కోసం రిజర్వాయర్ నిర్మించాలనే ప్రణాళికతో సీఎం కేసీఆర్ ఉన్నారు. వరంగల్ నగర అభివృద్ధి కోసం ప్రతి ఏటా రూ.300 కోట్లను బడ్జెట్‌లో కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు, కార్యక్రమాలను అమలు చేసే వ్యక్తి గ్రేటర్ వరంగల్ మేయర్ కావాలి. గ్రేటర్ వరంగల్ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుక్కలు, కోతుల బెడద లేని నగరంగా వరంగల్ మారాలి’ అని హరీశ్‌రావు అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు మహమూద్‌అలీ, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే బాబూమోహన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, తెలంగాణ వికాస సమితి ప్రతినిధులు చంద్రశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీష్‌రావు కేక్ తినిపించారు.