
ఈసారి 'పుష్కరాల'కు ప్రత్యేకం
హైదరాబాద్: ఈ ఏడాది గోదావరి పుష్కరాలను జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.
కేవలం ఏర్పాట్ల కోసమే రూ.425 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. గోదావరి ప్రవహించే ఐదు జిల్లాల్లో మొత్తం 69 స్నాన ఘట్టాలను నిర్మిస్తామని ఆయన అన్నారు.