చొప్పదండి: ఇంటర్ చదివే విద్యార్థి ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులకు వెళ్లిన తొలి రోజే ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన తిరుపతి(19) ఇంటర్ చదువుతున్నాడు.
ఈ క్రమంలో డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో సోమవారం ట్రాక్టర్ను తానే నడిపాడు. వెదురు గుట్ట కాకతీయ కెనాల్ వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్ సబ్ కెనాల్లో బోల్తాపడింది. దీంతో తీవ్రగాయాలైన తిరుపతి అక్కడికక్కడే మృతి చెందాడు.