2013లో సుప్రీంకోర్టు మూడు తీర్పులను వెలువరించడంతో ఎన్నికల నిర్వహణలో పారదర్శకత పెరిగింది. అంతే కాకుండా ప్రజల్లో విశ్వాసం పెరిగింది. డాక్టర్ సుబ్రమణ్య స్వామి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగానే ఓటరు తాము ఓటు వేశాక ఓటు వేసిన అభ్యర్థి వివరాలను చూసుకునేలా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు ఓటరు వెరిఫైడ్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్స్) యంత్రాన్ని అమర్చారు. ప్రస్తుతం జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో వీవీప్యాట్స్‌ను వినియోగిస్తున్నారు.
సాక్షి, జనగామ: దేశంలో ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ చాలా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రజలకు నచ్చిన నేతలను ఎన్నుకునే విధంగా అనేక మార్పులు తీసుకొచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలు పారదర్శకంగా ఉండాలనే కోణంలో ఖచ్ఛితమైన నిబంధనలు విధిస్తుంది. కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి.. పూర్తి స్థాయి పరిపాలన ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్లిపోతుంది. అధికారుల హోదాల్లో కూడా మార్పు కనిపిస్తుంది. స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థగా ఎలక్షన్ నిర్వహణలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సమయంలో సుమారు 50 లక్షల మంది ఉద్యోగుల సేవలు అవసరం ఉంటుందని అంచనా. దేశంలో మొట్టమొదటి సారి సాధారణ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్‌లోని ‘చిని’లో నిర్వహించారు. మొదటి భారత ఎన్నికల కమిషనర్‌గా సుకుమార్ సేన్ సేవలందించారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 17.30 కోట్లు అని నివేదికలు తెలుపుతున్నాయి. 1983లో జరిగిన 13వ సాధారణ ఎన్నికల్లో మొదటిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించారు. ఓటు హక్కు కనీస వయస్సు 21 సంవత్సరాలు కాగా, 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు కుదిస్తూ మార్పులు చేశారు. 1952లో 55 పార్టీలు ఎన్నికల్లో పాల్గొనగా, 2014 నాటికి ఆ సంఖ్య 370కి చేరింది.
సుప్రీం తీర్పులు..అనేక మార్పులు
దేశంలో జరిగే ఎలక్షన్ నిర్వహణలో సుప్రీంకోర్టు తీర్పులు అనేక మార్పులకు శ్రీకారం చుట్టాయి. కోర్టు తీర్పులకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో పలు మార్పులు తీసుకొచ్చింది.
నేరచరిత్ర, ఆస్తుల వెల్లడి..
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తన నేర చరిత్ర, ఆస్తిపాస్తులు, విద్యార్హతలకు సంబంధించిన తదితర వివరాలను విధిగా నామినేషన్ పత్రాల్లో పొందుర్చాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో ఆ పత్రాలు విధిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పిస్తారు. నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, తదితర వాటిని దాచి ఉంచి నామినేషన్ పత్రాల్లో జత పర్చకుంటే ఎన్నికల నియామవళి ప్రకారం ఆ నామినేషన్లను తిరస్కరిస్తారు. అదే విధంగా అభ్యర్థులు తమ నేరచరిత్రను సొంత ఖర్చులతో మూడుసార్లు ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని కేంద్రం ఎన్నికల సంఘం ఆయా జిల్లాల అధికారులను ఆదేశించింది.
నోటా బటన్ ఎప్పుడంటే...
2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఎన్నికల నిర్వహణలో రెండు కీలకమైన మార్పులు తీసుకువచ్చింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరు నచ్చకపోతే ప్రతికూలమైన ఓటు వేసేలా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో నోటా బటన్‌ను ఈవీఎం యంత్రంలో చిట్ట చివరన ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment