'సీసీ కెమెరాలతో నేరాల నివారణ' | Surveillance systems can reduce crime says acp | Sakshi
Sakshi News home page

'సీసీ కెమెరాలతో నేరాల నివారణ'

Published Wed, Jun 17 2015 4:35 PM | Last Updated on Wed, Apr 3 2019 8:29 PM

Surveillance systems can reduce crime says acp

రంగారెడ్డి: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేరాలను నివారించవచ్చని ఎల్‌బీనగర్ ఏసీపీ వేణుగోపాల్‌రావు తెలిపారు. 'సీసీ కెమెరాల ఏర్పాటు-నేరాల నివారణ' అంశంపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నాగోలులోని కోఆపరేటివ్ బ్యాంకు కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కాలనీకి కొత్తగా వచ్చే వ్యక్తులను గుర్తు పట్టవచ్చని, నేరాల సంఖ్య తగ్గించవచ్చని పేర్కొన్నారు. దీంతో స్మార్ట్ అండ్ సేఫ్ కాలనీగా మార్చుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్రాంతంలో 28 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు కాలనీవాసులు ముందుకు వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement