హైదరాబాద్: ఇప్పటి వరకు వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పెట్రోల్ బంకులకే పరిమితమైన బ్యాంక్ స్వైపింగ్ మిషన్ సేవలు ఇకపై తపాలా కార్యాలయాల్లో కూడా అందుబాటులో రానున్నాయి. తమ ప్రధాన కార్యాలయాల్లో పాయింట్ ఆఫ్ సెల్స్ పేరుతో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసేందుకు పోస్టల్ శాఖ సిద్ధమైంది. ఇప్పటికే స్వైపింగ్ మిషన్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇందులో భాగంగా హైదరాబాద్ అబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీస్‌లో స్వైపింగ్ మిషన్ సేవలు శనివారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తపాలా శాఖ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బీవీ సుధాకర్, ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ సీఆర్ శశి కుమార్ తదితరులు పాల్గొంటారు. ఇప్పటికే ఏటీఎం సేవలను ప్రారంభించిన తపాలశాఖ తాజాగా వినియోగదారులు ఏటీఎంలకు కూడా వెళ్లకుండా నేరుగా డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి పోస్టల్ సేవలు పొందే అవకాశం కలగనుంది.
తపాలా కార్యాలయాల్లో స్వైపింగ్ మిషన్లు
Published Sat, Jul 4 2015 2:59 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM
Advertisement