ఖమ్మం మామిళ్లగూడెం : కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు కూడా వర్తింపజేయాలన్న డిమాండుతో తెలంగాణ బీసీ ఫ్రంట్ (టీ-బీసీఎఫ్) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్‌లో 48 గంటల నిరాహార దీక్ష బుధవారం ప్రారంభమైంది. దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి ఫ్రంట్ జిల్లా అధ్యక్షురాలు కొత్తకొండ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. బీసీ కులాల్లో ఆర్థిక స్థోమత లేక, కుల వృత్తులు కునారిల్లడంతో తట్టుకోలేక అనేకమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎంతోమంది బీసీ నిరుపేదలు తమ బిడ్డలకు వివాహం చేయలేని దుర్భర దారిద్య్రంలో ఉన్నారని ఆవేదన వెలిబుచ్చారు. వీరందరికీ చేయూతనిచ్చేలా బీసీలకు కూడా కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింప జేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమంలో బీసీల పాత్ర చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ నుంచి ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతాచారి వరకు వందలమంది బీసీలు అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరేలా బీసీలకు కూడా వెంటనే కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేయూలని కోరారు.
‘‘బీసీలకు ఈ పథకాన్ని వర్తింపజేసే విషయూన్ని పరిశీలిస్తామని చెప్పడం కాదు. అమలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. ఫ్రంట్ జిల్లా గౌరవాధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. సమాజంలో అణచివేయబడిన బీసీలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని కోరారు. పోరుబాటతోనే బీసీలకు రాజ్యాధికారం సిద్ధిస్తుందన్నారు. ఈ దీక్ష శిబిరంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పట్ల నర్సింహారావు, నాయకులు నాగేశ్వరావు, హనుమంతరావు, గడ్డం ఉపేందర్, వేలాద్రి, అరుణకుమారి, కొండలు, సైదులు, అరుణ, కృష్ణవేణి, వసంత, కె.ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. పమ్మి రవి కళాబృందం ధూం-ధాం అలరించింది.
పలువురి సంఘీభావం
ఈ దీక్ష శిబిరాన్ని టీఎన్జీవోస్ అసోసియేషన్ జి ల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, నాయకు లు నందగిరి శ్రీనివాస్, వల్లోజి శ్రీనివాస్, సాగర్; ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు నల్లమోతు వి జయరాజు మాదిగ, రాంబాబు, రాంప్రసాద్; సీపీఐ నాయకుడు మేకల సంగయ్య; టీఎంఆర్‌పీఎస్ నాయకులు నాగభూషణం, సావిత్రిబాయి; పూలే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సయ్య సందర్శించి సంఘీభావం తెలిపారు.
‘కల్యాణలక్ష్మి’ కోసం టీ-బీసీఎఫ్ దీక్ష
Published Thu, Nov 20 2014 3:10 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement