సాక్షి, హైదరాబాద్: వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం టీ–శాట్ చానళ్లలో ప్రత్యేకంగా ఆంగ్లబోధన పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నట్లు టీ–శాట్ సీఈఓ ఆర్.శైలేశ్‌రెడ్డి వెల్లడించారు. రామకృష్ణ మఠం సౌజన్యం తో ‘ఇంగ్లిష్ ఫర్ ఆల్’కార్యక్రమాన్ని ఈ నెల 14 నుంచి ప్రతి ఆదివారం నిపుణ, విద్య చానళ్లలో ప్రసారం చేయనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు నిపుణ చానల్‌లో, సాయంత్రం 4గంటలకు విద్య చానల్‌లో 45 నిమిషాల పాటు కార్యక్రమాలను ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
టీఆర్టీ ప్రసారాలు మరో 3 గంటలు..
టీ–శాట్ నెట్‌వర్క్ చానళ్లలో ప్రసారం చేస్తున్న టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ) అవగాహన ప్రసారాలను ఈ నెల 12 నుంచి మరో 3 గంటలు అదనంగా ప్రసారం చేయనున్నట్లు శైలేశ్‌రెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవులున్న నేపథ్యంలో 5 రోజుల పాటు ప్రసారాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. నిపుణ చానల్‌లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4గంటల వరకు, విద్య చానల్‌లో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఈ అదనపు ప్రసారాలుంటాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment