హైదరాబాద్ నగరంలోని ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉప్పుగూడ-ఫలక్‌నుమా స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై మంగళవారం తెల్లవారుజామున ఓ యువతి మృతదేహం స్థానికులకు కనిపించింది.
హైదరాబాద్: నగరంలోని ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉప్పుగూడ-ఫలక్‌నుమా స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై మంగళవారం తెల్లవారుజామున ఓ యువతి మృతదేహం స్థానికులకు కనిపించింది. వారిచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాక్‌పై పడి ఉన్న యువతి మృతదేహాన్ని పక్కకు తొలగించారు. అయితే ఆమె గుర్తింపును తెలియజేసే ఎలాంటి ఆధారాలు లభించలేదు.
కాగా, ఆమె వయసు 25 ఏళ్లు ఉంటుందని అంచనా. యువతిని వేరే ఎక్కడో హత్య చేసి ట్రాక్‌పై పడి వేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా గొంతు భాగంలో నులిమినట్లు ఆధారాలున్నాయని తెలుస్తోంది.