ఇద్దరు అటు.. నలుగురు ఇటు | telangan divides the ias, ips | Sakshi
Sakshi News home page

ఇద్దరు అటు.. నలుగురు ఇటు

Aug 24 2014 4:35 AM | Updated on Jun 2 2018 2:56 PM

ఇద్దరు అటు.. నలుగురు ఇటు - Sakshi

ఇద్దరు అటు.. నలుగురు ఇటు

తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాలకు ఐఏఎస్.. ఐపీఎస్‌ల విభజన పూర్తయింది.

తెలంగాణ, ఏపీకి ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజన
- స్వరాష్ట్రంలోనే కలెక్టర్, ఎస్పీ
- తెలంగాణకు జేసీ, డీఐజీ
- ఆంధ్రాకు శ్రీకేశ్ లట్కర్, ఫకీరప్ప
సాక్షి, కరీంనగర్ :
తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాలకు ఐఏ ఎస్.. ఐపీఎస్‌ల విభజన  పూర్తయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 22న కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్‌లను ఆయా రాష్ట్రాలకు కేటాయించిం ది. మన జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సీని యర్ ఉన్నతాధికారులు తెలంగాణ పరిధిలోనే ఉండనున్నారు. తెలంగాణ  రాష్ట్రానికి చెందిన క లెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, ఎస్పీ శివకుమార్‌కు స్వరాష్ట్రంలోనే సేవలందించే అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డీఐజీ ఆర్.బి.నాయక్‌ను తెలంగాణకు కేటాయించారు. లక్నోకు చెందిన జేసీ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఎంచుకున్న ఆప్షన్ మేరకు తెలంగాణ కోటా వరించింది. మరో ఐఏఎ్‌స్ శ్రీకేశ్ బాలాజీరావు లట్కర్, ఐపీఎస్ ఫకీరప్పను ఆంధ్రాకు కేటాయిస్తూ ఢిల్లీలో ప్రత్యూష సిన్హా కమిటీ శుక్రవారం రాత్రి జాబితా విడుదల చేసింది.
 
తెలంగాణలోనే...!
- ఎం.వీరబ్రహ్మయ్య జూన్ 19, 2013లో ఇక్కడ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ జిల్లా వాస్తవ్యుడైన కలెక్టర్‌కు 1997లో ఐఏఎస్ కన్‌ఫం అయింది. తెలంగాణ కోటాలోనే కేటాయించడంతో కలెక్టర్ ఈ ప్రాంతంలోనే విధులు నిర్వర్తించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన సర్ఫరాజ్ అహ్మద్ 26, డిసెంబర్ 2013లో జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆప్షన్స్‌లో జేసీ తెలంగాణనే కోరుకోగా.. కేటాయింపూ ఆయన అభీష్టం మేరకే జరిగింది.
- తెలంగాణేతర ఐపీఎస్ అధికారి.. కరీంనగర్ డీఐజీ ఆర్‌బీ నాయక్‌కు కోరుకున్న తెలంగాణ రాష్ట్రమే కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన నాయక్ 7 మే 2012న కరీంనగర్‌లో డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. వరంగల్‌కు చెందిన ఎస్పీ శివకుమార్‌ను కూడా తెలంగాణకే కేటాయించారు. 31 అక్టోబర్ 2010న ఆయన జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
 
ఆంధ్రాకు ఇద్దరు
- మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన శ్రీకేశ్ బాలాజీరావు లట్కర్ 2011 నుంచి జిల్లాలో సేవలందిస్తున్నారు. మొన్నటి వరకు జగిత్యాల సబ్ కలెక్టర్‌గా పని చేసిన ఆయన్ను ప్రభుత్వం ఇటీవలే కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించింది. లట్కర్ తెలంగాణలోనే విధులు నిర్వర్తించేందుకు మొగ్గు చూపి.. ఆప్షన్ ఎంచుకున్నా జూనియర్ కావడంతో కేంద్రం ఆయన ఆప్షన్‌ను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం.
- కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి ఫకీరప్పను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. మూడు నెలల క్రితమే గోదావరిఖని డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఫకీరప్ప తెలంగాణలోనే పని చేసేందుకు సుముఖత చూపినట్లు తెలిసింది. అయినా ఫలితం లేకుండాపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement