తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌ 2017-18 | telangana budget highlets-2017-18 | Sakshi
Sakshi News home page

తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌ 2017-18

Published Mon, Mar 13 2017 12:21 PM | Last Updated on Sun, Apr 7 2019 3:50 PM

telangana budget highlets-2017-18

హైదరాబాద్‌: తెలంగాణ బడ్జెట్‌  2017-18ను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ప్రవేశపెట్టారు. తాను బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి అని, తనపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు అంటూ ఆర్థికమంత్రి చెప్పారు. అనంతరం బడ్జెట్‌ ప్రసంగం చదువుతూ బడుగు బలహీనవర్గాల వారికి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని ఆర్థికమంత్రి చెప్పారు. ఈసారి బడ్జెట్‌ రూపకల్పనలో కొత్త పద్దతులు పాటించినట్లు చెప్పారు. ఈ బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజల్లో విశ్వాసం నింపుతుందని చెప్పారు. ఎస్సీఎస్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ఆర్థికమంత్రి ఈటల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోని హైలైట్స్‌ ఒకసారి పరిశీలిస్తే..



తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌-2017-18

19.61 శాతం వృద్ధిరేటు సాధించాం
రెవెన్యూ వృద్ధి గణనీయంగా పెరిగింది
కేంద్రం ఆదేశాల మేరకు ఏకరీతిన బడ్జెట్ ను రూపొందించాం
2017-18 బడ్జెట్ రూపకల్పనలో భిన్నపద్ధతులు అవలంభించాం
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చర్యలు తీసుకుంటున్నాం
కొత్త నోట్ల రద్దుతో ఆదాయం తగ్గినప్పటికీ ఇతర పన్నుల ద్వారా ఆదాయం పెరిగింది
ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేశారు
ప్రజల విశ్వాసానికి అనుగుణంగా నిలవాలని మా ప్రయత్నం
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైంది
నాపై నమ్మకం ఉంచిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు
వరుసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది

రాష్ట్ర బడ్జెట్ రూ. 1,49,646 కోట్లు
ప్రగతి పద్దు రూ. 88,038 కోట్లు
నిర్వహణ వ్యయం రూ. 61,607 కోట్లు
రెవెన్యూ మిగులు అంచనా రూ. 4,571 కోట్లు

మహిళా శిశు సంక్షేమం కోసం రూ. 1731 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ. 5,070 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 1249 కోట్లు
ఆసరా ఫించన్ల కోసం రూ. 5,330 కోట్లు
బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు
ఫీజు రియింబర్స్ మెంట్ కోసం రూ. 1939 కోట్లు
చేనేత కార్మికుల కోసం రూ. 1200 కోట్లు
చివరి విడత రైతుల రుణమాఫీకి రూ. 4000 కోట్లు

ఇరిగేషన్ కు రూ. 26,652 కోట్లు
విద్యారంగ అభివృద్ధికి రూ. 12,705 కోట్లు
వైద్య, ఆరోగ్య రంగాలకు రూ.5,976 కోట్లు
పంచాయతీరాజ్ వ్యవస్థకు రూ. 14,723 కోట్లు

పట్టణాభివృద్ధికి రూ. 5,599 కోట్లు
మిషన్ భగీరథకు రూ. 3000 కోట్లు
రహదారుల అభివృద్ధికి రూ. 5,033 కోట్లు
జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 30 కోట్లు
మిగతా కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు
గ్రేటర్ వరంగల్ కు రూ. 300 కోట్లు

జీహెచ్ఎంసీకి రూ. 1000 కోట్లు
పర్యాటక, సాంస్కృతిక రంగానికి రూ. 198 కోట్లు
శాంతి భద్రతలకు రూ. 4,828 కోట్లు
ఐటీ రంగానికి రూ. 252 కోట్లు
హరితహారానికి రూ. 50 కోట్లు
విద్యుత్ రంగానికి రూ. 4,203 కోట్లు
పారిశ్రామిక రంగానికి రూ. 985 కోట్లు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement