
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. మార్చి 25వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలించి, 28న ఉపసంహరణకు గడువు ఇస్తామని చెప్పారు. ఎన్నికల ఫలితాలను మే 23న ప్రకటిస్తామని వెల్లడించారు. నామినేషన్లు సమర్పించేందుకు ఐదుగురు మించి రావద్దని ఆదేశించారు. 24 గంటల్లోగా ఓటర్లను ప్రభావితం చేసే బ్యానర్లు, నాయకుల ఫోటోలు తొలగించాలని సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.