తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా వేల పోస్టులను ఒకేసారి భర్తీ చేసిన పోలీస్‌శాఖ మరో భారీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. కొత్త జిల్లాల్లోని పోలీస్ విభాగాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులతోపాటు కొత్త బెటాలియన్లు, ఆర్మ్‌డ్ రిజర్వ్, ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ తదితరాల్లో సిబ్బంది భర్తీకి చర్యలు చేపట్టనుంది.
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా వేల పోస్టులను ఒకేసారి భర్తీ చేసిన పోలీస్‌శాఖ మరో భారీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. కొత్త జిల్లాల్లోని పోలీస్ విభాగాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులతోపాటు కొత్త బెటాలియన్లు, ఆర్మ్‌డ్ రిజర్వ్, ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ తదితరాల్లో సిబ్బంది భర్తీకి చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా కేవలం పోలీస్‌శాఖ నుంచే ఏకంగా 18 వేల పోస్టులను భర్తీ చేసేందుకు జూన్ 1న నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి పోలీసుశాఖకు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
నియామక ప్రక్రియలో మార్పుల్లేవు...
పోలీసు పోస్టుల నియామక ప్రక్రియలో ఎటువంటి మార్పులు లేవని రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, మహిళలకు సివిల్ విభాగంలో 33 శాతం, ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో 10 శాతం రిజర్వేషన్ ఉంటుందని వివరించారు. అలాగే గతంలోలాగే మౌఖిక పరీక్షల ద్వారానే నియామక ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా పరీక్షలను నిర్వహించేందుకు కసరత్తు చేసినా లక్షల మంది హాజరవుతున్న నేపథ్యంలో అంత మంది అభ్యర్థులకు ఒకేసారి కంప్యూటర్లు అందుబాటులో ఉండటం కష్టసాధ్యమని భావించి వెనక్కి తగ్గినట్లు ఉన్నతాధికారులు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు.
వయోసడలింపు లేదు...
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారి జరిగిన పోలీస్ నియామక ప్రక్రియలో అన్ని వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం నాలుగేళ్ల వయోసడలింపు కల్పించింది. అయితే ఈసారి కూడా వయోసడలింపు అమలు చేయాలని నిరుద్యోగుల నుంచి ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఒకవేళ నోటిఫికేషన్ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సవరించి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతంలో 10 వేల పోస్టులకు జరిగిన నియామకాలకు 7.5 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఈసారి కూడా అదే రీతిలో స్పందన ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పోలీసు యూనిట్ల ఆధ్వర్యంలో ఇప్పటికే ఉచిత శిక్షణ కేంద్రాలు కూడా నడుస్తుండటంతో ప్రతిభగల అభ్యర్థులు వస్తారని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment