సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరగడంతో పోలీస్‌శాఖ మరింత అప్రమత్తం అయ్యింది. గురువారం మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో కొవిడ్ పాటిజివ్ కేసుల సంఖ్య ఏకంగా 16కి చేరింది. రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతతో పాటు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
(స్తంభించిన రాకపోకలు)
శంషాబాద్ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్టాండుల్లో ప్రత్యేక పికెట్‌లు ఏర్పాటు చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్ని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. కరీంనగర్ లో ఇండోనేషియా నుంచి వచ్చిన వారి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎంత మంది వచ్చారు. ఎక్కడెక్కడకి వెళ్లారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ శాఖ ప్రతి గ్రామంలో ఒక ప్రత్యేక పోలీస్ అధికారిని నియమించింది. సభలు, సమావేశాలు, వివాహాలకు అనుమతులను నిరాకరిస్తున్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని పోలీస్‌శాఖ కోరింది.
(దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా)
Comments
Please login to add a commentAdd a comment