
కేసీఆర్ సీఎం అయితేనే అభివృద్ధి: బాజిరెడ్డి
టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణను అభివృద్ధి చేసుకోవచ్చని ఆ పార్టీలో చేరిన బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్నారు.
నిజామాబాద్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణను అభివృద్ధి చేసుకోవచ్చని ఆ పార్టీలో చేరిన బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్నారు. నిజామాబాద్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా కేసీఆర్ సుదీర్ఘ పోరాటం చేసి కలను సాకారం చేశారన్నారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టో అన్నివర్గాలకు మేలు చేసేలా ఉందన్నారు. ఏళ్ల తరబడి వివక్షకు గరైన మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులను మెజారిటీ స్థానాలలో గెలిపించాలని కోరారు.