కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కుందూరు జానారెడ్డి అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని..
హైకోర్టులో టీడీపీ నేత తేరా చిన్నపరెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కుందూరు జానారెడ్డి అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కోరినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఏ మాత్రం స్పందించడం లేదని పేర్కొంటూ టీడీపీ నేత డాక్టర్ తేరా చిన్నపరెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జానారెడ్డి అక్రమాలపై విచారణ జరిపేలా సీబీఐ, తెలంగాణ ప్రభుత్వాన్ని, డీజీపీని ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోర్టును కోరారు. మనీలాండర్ చట్ట నిబంధనలను జానారెడ్డి ఎలా అతిక్రమించింది పూర్తి ఆధారాలను తాను సీబీఐకి ఇచ్చానని, ఆ తరువాత దీనిని కేంద్ర హోంశాఖకు సైతం అందచేశానని చిన్నపరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.