11 మందికి రిమాండ్
జడ్చర్ల : మండల పరిదిలోని గంగాపురం గ్రామంలో ఈ నెల 19న ప్యాట గోపాల్(45) హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యకేసులో నిందితులుగా ఉన్న 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ జంగయ్య ఈ హత్యకేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గంగాపురం గ్రామానికి చెందిన గోపాల్‌కు అదే గ్రామ పరిధిలోని కోడుపర్తిలో ఉన్న దాయాదులు ఊషన్న, మల్లయ్య, లక్ష్మయ్య కుటుంబాలకు గత కొంత కాలంగా పాతకక్షలు, భూతగాదాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గోపాల్ పై కక్ష పెంచుకొని ఈనెల 19న అతి దారుణంగా హత్య చేశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయించగా వారే హత్మ చేసినట్టు రుజువైంది. దీంతో ఊషన్న, ప్యాట ఆంజనేయులు, శేఖర్, శ్రీనువాసులు, మల్లయ్య, పెంటయ్య, రాజు, వెంకటయ్య, మల్లేష్, పాండు, పెంటయ్య, మల్లేష్‌లను అరెస్ట్ చేశారు. వీరిలో మల్లేష్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడని, అదుపులో తీసుకున్న వారిని జడ్చర్ల కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
హత్యకేసులో నిందితుల అరెస్ట్
Published Thu, Nov 27 2014 4:04 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement