
ఆధ్యాత్మిక దీక్షతో శాంతి సామరస్యం: మంత్రి పోచారం
బోధన్ : ఆధ్యాత్మిక దీక్షలు సమాజానికి శుభ సూచకమని, దీక్షలతో సమాజంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొంటుందని వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని రాకాసీపేట్ భీమునిగుట్టపై అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప సేవా సమితి అ ధ్వర్యంలో నూతనంగా దీక్షా మందిరాన్ని నిర్మించారు. ఆదివారం దీక్షా మందిరం ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి మా ట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక ఆలయాలు అభివృద్దికి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు.
హైదరాబాద్ సమీపంలోని యాదగిరిగుట్ట లక్ష్మినర్సింహా స్వామి ఆలయాన్ని మరో తిరుమ ల తిరుపతి క్షేత్రంగా మారుస్తామని, రాష్ట్ర బడ్జెట్‌లో రూ. వంద కోట్లు కేటాయించామ ని పేర్కోన్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ, ఎంపీ పీ గంగాశంకర్, జడ్పీటీసీ సభ్యురాలు అల్లె లావణ్య,అయ్యప్ప సేవ సమితి అధ్యక్షుడు శివన్నారాయణ, కార్యదర్శి చక్రవర్తిఘనస్వాగతం పలికారు.మందిరం ప్రారంభోత్సవం అనంతరం ఆలయంలో మంత్రి పూజలు చేశారు.
మంత్రికి అయ్యప్ప సేవ సమితి ప్రతినిధులు , మున్సిపల్ చైర్మన్, కమిషనర్ ప్రసాద్‌రావు, అయ్యప్ప దీక్ష పరులు శాలువ ,జాప్ఞికతో సన్మానించారు. కార్యక్రమంలో కోటగిరి జడ్పీటీసీ పుప్పాల శంకర్, అయ్యప్ప సేవ సమితి ప్రతినిధులు పత్తిరాము, సాంబశివరావు, నాగభూషణం గుప్తా,మాజీ మున్సిపల్ చైర్మన్ సునీతా దేశాయ్,మాజీ ఎంపీపీ గిర్దావర్ గంగారెడ్డి, టీఆర్‌ఎస్‌నాయకులు శరత్ రెడ్డి,రజాక్, న్యాయవాది అబిద్ అలీ, కాంగ్రెస్ మండల నాయకుడు అల్లె రమేష్,పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
కౌలాస్ ఆయకట్టును స్థిరీకరిస్తాం
నిజాంసాగర్ : జుక్కల్, బిచ్కుంద మండలాలకు వరప్రదాయినిగా ఉన్న కౌలాస్ నాలా ఆయకట్టును స్థిరీకరించడానికి కృషిచేస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం జుక్కల్ మండల కేంద్రంలో సహకార బ్యాంక్ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కౌలాస్ ప్రాజెక్టు పూర్తిగా నిండినా 9 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందడం లేదని, ఆధునీకరణతో ఆయకట్టుకు నీరందించేలా చూస్తామన్నారు.
బిచ్కుంద : రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బిచ్కంద మండలం పెద్దకొడప్‌గల్ గ్రామంలో 17లక్షల, యాభై వేల నిధులతో ఐదు వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన సొసైటీ గోదాంను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతు రైతులు ధాన్యాన్ని నిలువ ఉంచుకోవడానికి జిల్లాలో 60 గోదాముల నిర్మాణానికి బీఆర్‌జీఎఫ్, 14 ఆర్థిక సంఘం నిధులు, నాబార్డు నిధులతో నివేదికలు తయారు చేసి పంపామని తెలిపారు.
గతంలో పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు తెలంగాణలో కరెంటు ఉత్పత్తికి ఎలాంటి చర్యల తీసుకోకపోవడంతో ప్రస్తుతం కరెంటు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. అయినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కరెంటు సమస్యల పరిష్కారానికి కృషిచేస్తొందని అన్నారు. 20 వేల మెగావాట్ల కోసం సోలార్, వివిధ రకాలతో కరెంటు తయారు చేసుకోవడాని ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మూడు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కరెంటు సమస్య ఉండదన్నారు. రుణమాఫీ కింద జిల్లాలో ఎనిమిది వందల కోట్లు రైతు ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.
ఫింఛన్లు, ఆహార భద్రత కార్డులు, ఇంటి కోసం 120 గజాల స్థలం కేటాయిస్తూ, నిర్మాణానికి మూడున్నర లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రేషన్ కార్డులు మంజూరైన లబ్ధిదారులకు ఒకొక్కరికి ఆరు కిలోల బియ్యం అందిస్తామన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్యే హన్మంత్ సింధే, డీసీసీబీ చైర్మన్ గంగాధర్ పట్వారీ, ఐదు మండలాల జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీ టీఆర్‌ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.