ఇది నిరంతర ప్రక్రియ
దుబ్బాక: సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన వారు ఎప్పుడైనా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను నిరుపేద కుటుంబాలకు అందించేందుకుచిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. అందువల్లే సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యకు పరి మితి విధించలేదన్నారు. అర్హులు ఎంతమంది ఉన్నా, సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. ఆదివారం ఆయన దుబ్బాక డిపోకు మంజూరు చేసిన రెండు కొత్త బస్సులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో 2.50 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్‌లకు అర్హులని గుర్తించామన్నారు. జిల్లాల్లోని 10 నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన సదరం క్యాంపులో మరో 3 వేల మంది వికలాంగులను పింఛన్‌లకు అర్హులని నిర్ధారించామన్నారు. అర్హులై ఉండి పింఛన్లు రానివారు స్థానిక ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి కాల పరిమితి విధించలేదన్నారు. అర్హులందరికీ ఈ నెల 10 నుండి 15 లోగా పింఛన్లను అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
నిరుపేద దళిత, మైనార్టీ కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లికి ముందే రూ. 51 వేలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. జిల్లాలో 136 సాంఘిక సంక్షేమ వసతి గ ృహాలు ఉన్నాయని, ఆయా వసతి గ ృహాల్లో అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నెలకోసారి రాత్రిబస చేసి వసతి గృహాల్లోని సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే సన్నరకం బియ్యాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అం దిస్తోందన్నారు.
హాస్టళ్లలో మ రుగుదొడ్లు, తాగునీరు లాం టి మౌలిక వసతులు కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం మంత్రి హరీష్‌రావుతోపాటు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, కలెక్టర్ రాహుల్ బొజ్జా, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఆర్‌ఎం రాజు, డిపో మేనేజర్ భానుకిరణ్, తహశీల్దార్ అరుణ, ఎంపీడీఓ ప్రవీణ్ తదితరులు దుబ్బాక డిపో నుంచి నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్ వరకు కొత్త బస్సులో ప్రయాణించి ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట
చిన్నకోడూరు: రైతు సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం ఆయన చిన్నకోడూరు మండల కేంద్రంలో భూ సమస్యల పరిష్కార పత్రాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడా రెవెన్యూ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో 2,892 సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ నెల 15 నుంచి వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు పెంచిన పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు.
చిన్నకోడూరు మండలంలో 5,932 మందికి పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ నెల నుంచి రేషన్‌లో బియ్యం కోటా పెంచుతున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రి హరీష్‌రావు పెద్దకోడూరులో రూ. 14 లక్షలతో నిర్మించిన అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఆర్డీఓ ముత్యంరెడ్డి, తహశీల్దార్ పరమేశ్వర్, ఎంపీడీఓ భిక్షపతి, జెడ్పీటీసీ సభ్యురాలు నమూండ్ల కమల పాల్గొన్నారు.