సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎన్నికల హామీలో భాగంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త పింఛన్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద అర్హుల ఎంపిక కోసం గత ఆగస్టులో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను సరిపోల్చుతూ.. తాజాగా లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేశారు. ఈ క్రమంలో గతంలో ఉన్న పింఛన్‌దారులను రద్దు చేయడంతో.. కొత్తగా 3,69,118 మంది దరఖాస్తు చేసుకున్నారు.
వీటిని పరిశీలించిన తనిఖీ బృందాలు 1,23,778 దరఖాస్తులను తిరస్కరించి 2,37,256 మందిని అర్హులుగా తేల్చారు. ఇందులో పావువంతు కొత్తవారు ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నారు. ఈలెక్కన 59,314 మంది కొత్త పింఛన్‌దారులున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనర్హుల వేటు ప్రక్రియ కూడా పూర్తిచేశారు. గతనెలలో జిల్లా వ్యాప్తంగా 2.54లక్షల మంది పింఛన్లు పొందగా.. తాజాగా ఈ సంఖ్య 2.37లక్షలకు చేరింది. ఇందులో కొత్తగా పింఛన్లు తీసుకునే వారిని మినహాయిస్తే.. గతంలో పింఛన్లు తీసుకున్న 76,728 మంది అనర్హులయ్యారు.
సర్వే వివరాలు సరిపోలక..
ఆసరా పథకానికి సంబంధించి అర్హుల ఎంపిక ప్రక్రియలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు కీలకమయ్యాయి. అయితే పట్టణ ప్రాంతంలో ఈ సర్వే వివరాలు.. దరఖాస్తులతో పోలిక లేకపోవడంతో పలువురిని తిరస్కరించారు. తిరస్కరణకు గురైన వారిలో పలువురు సమగ్ర కుటుంబ సర్వే సమయంలో వారి సొంత గ్రామాల్లో వివరాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
తాజా పరిశీలనలో మండలాలు యూనిట్‌గా తీసుకుని తనిఖీ బృందాలకు ఇచ్చిన వివరాల ఆధారంగా సర్వే చేయడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
డివిజన్ల వారీగా వచ్చిన దరఖాస్తులు, మంజూరు
డివిజన్ దరఖాస్తులు అర్హులు
చేవెళ్ల 78,191 58,538
మల్కాజిగిరి 43,954 29,558
రాజేంద్రనగర్ 14,131 7,343
సరూర్‌నగర్ 58,907 37,322
వికారాబాద్ 60,479 36,459
పట్టణప్రాంతం 1,13,456 68,036
‘ఆసరా’ కొందరికే!
Published Sat, Nov 8 2014 12:33 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
Advertisement
Advertisement