
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ ఉద్యోగుల బదీలీలను పంచాయతీ ఎన్నికల తర్వాతే చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. మండల విస్తరణ అధికారులకు ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రూర్బన్, ఉపాధి హామీ, ఉద్యోగుల బదిలీలపై ఉన్నతాధికారులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి జూపల్లి శనివారం సమీక్షించారు.
ఎక్కువకాలం ఒకేచోట పనిచేస్తున్న ఎంపీడీవోల బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. రూర్బన్ పథకంలో భాగంగా సంబంధిత టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీకి సగటున 50 రోజుల కన్నా ఎక్కువ పని కల్పిస్తే ప్రోత్సాహకాలు అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్‌లను ఆదేశించారు.