టీఆర్‌ఎస్‌లో ముదురుతున్న వర్గపోరు
ఉద్యమ కార్యకర్తల ఊసెత్తని నేతలు
రెండు, మూడువర్గాలుగా గులాబీదళం
పార్టీ పెద్దలకు అందుతున్న ఫిర్యాదులు
సంస్థాగత ఎన్నికల్లోనూ వర్గపోరుదే పైచేయి
టీఆర్‌ఎస్‌లో వర్గపోరు తారాస్థారుుకి చేరింది. కొత్తగా వచ్చిన వారి ఆధిపత్యంతో పాతవారు సతమతమవుతున్నారు. ఉద్యమకారుల ఊసేలేకుండా పోరుుంది.. చివరికి తమకే సభ్యత్వ పుస్తకాలు ఇవ్వటం లేదని పార్టీ పెద్దలకు ఉద్యమనేతలు ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి వచ్చింది. ఓవైపు జలగం, తుమ్మల వర్గీయుల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది..మరోవైపు ఉద్యమనేతలు, కార్యకర్తలు సంబంధిత నేతల తీరు సరిగా లేదని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు, ఫ్లెక్సీల చించివేత, బాహాబాహీ, నిరసనలు, నిరాహారదీక్షలు, గ్రామాల్లో ిపికెటింగ్‌ల వరకు పరిస్థితి వెళ్లింది.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : టీఆర్‌ఎస్‌లో వర్గపోరు ఊపందుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి జెండామోసిన వారికి దిక్కేలేకుండా పోరుుంది. కొత్తగా వచ్చిన వారి ఆధిపత్యంతో పాతనేతలు, కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు జరుగుతున్న అన్యాయూన్ని పార్టీ పెద్దలు, మంత్రు ఓలు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు దృష్టికి శనివారం తీసుకెళ్లినట్లు సమాచారం.మంత్రి తుమ్మల, బాలసాని లక్ష్మీనారాయణ తీరు ఏమాత్రం సరిగా లేదని హైదరాబాద్ వెళ్లి మరీ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జలగం, తుమ్మల వర్గీయులు పరస్పరం విమర్శలు, ఫ్లెక్సీల చించివేత, నిత్యవివాదాల్లో మునిగితేలుతున్నారు.
ఆధిపత్య పోరు
ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారికి ప్రస్తుతం మొండిచేయే ఎదురవుతోంది. జిల్లాపార్టీ, ఖమ్మం నగరంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల గురించి పార్టీ సీనియర్ నేతలకు సమాచారం ఉండటం లేదంటున్నారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పార్టీలో చేరిన కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, కొన్ని నెలల క్రితం పార్టీ తీర్థం పుచ్చుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ వర్గీయులు ఆధిపత్యపోరు సాగిస్తున్నారు. మంత్రితో పాటు జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్ చైర్మన్ ఎగ్గడి అంజయ్య తదితరులు పార్టీలో చేరారు.
వీరికి కొద్దిరోజుల ముందే ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మె ల్యే బానోతు మదన్‌ఆల్ టీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఆ తర్వాత సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ, టీడీపీల నుంచి పలువురు నాయకులు పెద్ద ఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి వచ్చిన వారందర్నీ స్వాగతించిన అధిష్టానం... ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశంలో మాత్రం స్పష్టత ఇవ్వలేకపోవడంతో ఆధిపత్యపోరు తారాస్థారుుకి చేరింది. ఈ ఆధిపత్యపోరే పలుమార్లు వివాదాలకు దారి తీసింది.
వివిధ సందర్భాల్లో చోటు చేసుకున్న వివాదాలు..
పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీచేసిన పల్లా రాజేశ్వరరెడ్డి విజయూన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో ఫిబ్రవరి 27న ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పార్టీ నేతలు, ద్వితీయశ్రేణి నాయకులు పార్టీలో కొందరు నేతలు అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఒకదశలో బాహాబాహీకి దిగారు. పార్టీకి తాము చేసిన సేవలను గుర్తించకుండా కరివేపాకులా ఉపయోగించుకుని పడేస్తున్నారంటూ ఆందోళనకు పూనుకున్నారు.
ముందునుంచి పార్టీలో ఉంటున్న తమను పట్టించుకునేవారే కరువయ్యూరని టీఆర్‌ఎస్ బోనకల్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు నిరాహారదీక్షకు పూనుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న ఆయనతో మంత్రి హరీశ్‌రావు శనివారం మాట్లాడారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇవ్వడంతో ఆయన ఆందోళన విరమించారు.
గతనెల 27, 28 తేదీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా కూడా వివాదం తలెత్తింది. సీఎం కు స్వాగతం పలుకుతూ కొత్తగూడెంలో తుమ్మల వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వర్గీయులు చించివేశారు. దీనిపై తుమ్మల వర్గీయులు జలగం అనుచరులపై పాల్వం చ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్టేషన్ ఎదుట కొద్దిసేపు ఆందోళన కూడా నిర్వహించారు. తాము చేసిన ఫిర్యాదుకు రశీదు ఇవ్వాలని జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్, మంత్రి తుమ్మల అనుచరుడు బరపటి వాసుదేవరావు డిమాండ్ చేశారు. ఈ ఫ్లెక్సీల వివాదం ఇప్పటికీ రగులుతూనే ఉంది. ఇదే పరిస్థితి ఖమ్మం, సత్తుపల్లి, మధిర, భద్రాచలం నియోజకవర్గాల్లోనూ ఉంది.
ఇక వైరా నియోజకవర్గంలో మరో విచిత్ర పరిస్థితి నెలకొంది. వైఎస్సార్‌సీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ వర్గీయులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు, ఆది నుంచి పార్టీలోనే కొనసాగుతున్న నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ‘వైఎస్సార్‌సీపీని వీడి తప్పు చేశాను..’ అని టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు సమయంలో సభావేదిక మీదే ఎమ్మెల్యే మదన్‌లాల్ వ్యాఖ్యానించటం సంచలనం కలిగించింది.
అశ్వారావుపేట నియోజకవర్గంలో తుమ్మల, జలగం వర్గీయుల మధ్య వివాదం నడుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు వర్గీయులు కూడా ఆధిపత్యపోరుతో ఇబ్బంది పడుతున్నారు.
మధిర నియోజకవర్గం చింతకాని మండలం వందనం గ్రామంలోనూ వర్గపోరు నెలకొంది. టీడీపీ నుంచి వచ్చిన వారు, సీపీఎం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారి మధ్య గొడవ జరిగింది. సీపీఎం, సీపీఐ నుంచి వచ్చిన వారు ఒకటిగా, టీడీపీ నుంచి వచ్చిన వారు మరో వర్గంగా ఏర్పడి పరస్పరదాడులకు దిగారు. గ్రామంలో పికటింగ్ ఏర్పాటు చేసే వరకు పరిస్థితి వచ్చింది. భద్రాచలం, సత్తుపల్లి, పాలేరు, ఇల్లెందు..ఇలా ఏ నియోజకవర్గంలో చూసినా వివాదాలే నెలకొన్నారుు.
పార్టీ సంస్థాగత ఎన్నికల్లో సైతం వర్గపోరు అడుగడుగునా బహిర్గతమయ్యే పరిస్థితి కనపడుతోంది. సభ్యత్వ నమోదులోనూ ఈ వర్గపోరు బయటపడింది. సభ్యత్వ పుస్తకాలు ఒకవర్గం వారి వద్ద ఉంటే.. మరో వర్గం తమకు ప్రత్యేక పుస్తకాలు ఇస్తే తప్ప సభ్యత్వం నమోదు చేయమని భీిష్మించిన పరిస్థితి ఉంది. ఇక జిల్లాస్థాయిలోముఖ్య నేతల మధ్య కూడా సక్యత లేదనే అభిప్రాయూలు వెల్లడవుతున్నారుు.
ఇదిలావుండగా పార్టీలో తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, వివిధ నియోజకవర్గాలకు చెందిన సీనియర్ నేతలు కంచర్ల చంద్రశే ఖర్ (కొత్తగూడెం), అబ్దుల్‌నబీ (ఖమ్మం), బత్తుల సోమయ్య (పాలేరు), పాలడుగు శ్రీనివాస్ (సత్తుపల్లి) నేతృత్వంలో ఉద్యమనేతల బృందం మంత్రులు రాజేందర్, హరీశ్‌రావును శనివారం హైదరాబాద్‌లో కలిసి వివరించినట్లు తెలిసింది. పార్టీలో తుమ్మల, బాలసాని ఏకపక్షధోరణితో వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు ఈ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు మంత్రులు వారికి భరోసా ఇచ్చినట్లు సమాచారం.
‘కారు’..వార్..!
Published Sun, Apr 5 2015 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM
Advertisement
Advertisement