మీడియా సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు.. | Trs fires on Ap cm Chandrababu naidu | Sakshi
Sakshi News home page

మీడియా సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు..

Published Fri, Jun 2 2017 6:10 PM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

మీడియా సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు..

మీడియా సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు..

హైదరాబాద్‌: తెలంగాణ అంతటా పండగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక పోతున్నారని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణను చూసి ఆయన కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు.

ఇటలీ స్వాతంత్ర్య దినోత్సవం రోజే ఏపీ విభజన జరిగిందని చంద్రబాబు తన ఆక్రోశం వెళ్లగక్కారని ...అయితే ఇటలీ స్వాతంత్ర దినోత్సవం మార్చి 27 అని అన్నారు. ప్రజలతో పాటు మీడియా సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారని, ఆయనవి అన్నీ చంద్రబాబు థర్డ్ క్లాస్ పొలిటీషియన్ లాగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు.

తెలంగాణ అవతరణ రోజును చీకటి రోజు అనడం సమంజసమేనా  అని నిలదీశారు. ఏపీ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చ గొట్టేందుకే బాబు నిర్లజ్జ గా మాట్లాడుతున్నారని అన్నారు. సొంత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించి చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు.  తెలంగాణ టీడీపీ నాయకులు ఇప్పటికైనా ఆ పార్టీ లో కొనసాగడం పై పునరాలోచన చేయాలని అన్నారు.                                     
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement