హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారని ఆ రాష్ట్ర పార్టీ శాసనసభ పక్షనేత కె.జానారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో సోనియాకు కృతజ్ఞతలు తెలపాలని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కె.జానారెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొని... ఆ దిశగా అడుగులు వేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి కూడా కృతజ్ఞతలు తెలపాలని సూచించారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
సోనియాకు కృతజ్ఞతలు చెప్పాలి: జానారెడ్డి
Published Fri, Nov 7 2014 2:01 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement