తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్‌దే..
వర్ధన్నపేట టౌన్ : తెలంగాణ ఏర్పాటు కోసం నిరంతరం ఉద్యమించిన వారిని పక్కన పెట్టి తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసిన ఘనత టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని టీ టీడీపీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లాలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి వంటి ఎంతో మంది ఉద్యమకారులకు నేటి వరకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చి వారి వద్ద కేసీఆర్ అందినంత దండుకుని అందలెమెక్కించారన్నారు.
టీఆర్‌ఎస్ సంవత్సర పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కుల, ప్రజ, విద్యార్థి సంఘాలకు సీఎం చేసింది ఏమీ లేదన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చి మెదక్‌లోని తన ఫాం హౌస్‌కు నీరు అందేలా చేసుకుని వరంగల్ జిల్లాను ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తామని, దళితుడిని సీఎం చేస్తానని, బీసీలను అభివృద్ధి చేస్తానని... జిల్లాలో టెక్స్‌టైల్ పార్క్‌ను నిర్మిస్తానని హామీలు గుప్పించి.. అన్నీ మరచిపోయూరని విమర్శించారు. జిల్లా కేంద్రంలో మూడు రోజులు మకాం వేసి మురికి వాడల్లో తిరిగి దుర్వాసన వస్తుందంటూ స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా ఇళ్లు నిర్మిస్తామని మాయ మాటలు చెప్పి.. ప్రజలను బురిడీ కొట్టించి పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. నగరం చుట్టూ రింగు రోడ్డు నిర్మిస్తామని ప్రకటించి.. నిధులు కేటాయించలేదని దుయ్యబట్టారు. సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఈగ మల్లేశం, నాయకులు తూల్ల కుమారస్వామి, పెంచాల కు మారస్వామి, సిలువేరు కుమారస్వామి, సమ్మిరెడ్డి, తుమ్మల యాకయ్య, చొప్పరి సోమయ్య, నాగెల్లి సురేష్, బొంత కాంతం, చిదురాల ఎల్లగౌడ్ బక్కతట్ల రాజు పాల్గొన్నారు.
అరిపిరాలలో ఎర్రబెల్లి వర్సెస్ టీఆర్‌ఎస్ నాయకులు
తొర్రూరు : వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలోని అరిపిరాలలో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపనకు వెళ్లిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. తమ గ్రామానికి ఏమి చేశావని, గతంలో ఇచ్చిన హమీలు ఒక్కటి కుడా అమ లు చేయలేదని, రోడ్డు పనులకు శంకుస్థాపన చేయొద్దంటూ సర్పంచ్ బిక్షపతి, ఉప సర్పంచ్ సధాకర్, నాయకులు చెవిటి సధాకర్‌తోపాటు మరికొందరు ఎర్రబెల్లితో గొడవకు దిగారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. పోలీసులు స్పందించి టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకులను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.
అదనంగా నిధులు తీసుకరావాలే
తొర్రూరు: నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూ రైన నిధులను రాకుండా అడ్డుకోవడం మానుకుని, అదనంగా నిధులు తీసుకొచ్చేందుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కృషి చేయాలని పాలకుర్తి ఎమ్మె ల్యే, టీడీపీ శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడా రు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికి నిధులు ఇచ్చినట్లే పాలకుర్తికి కుడా రూ. 30 కోట్ల నిధులు కేసీఆర్ మంజూరు చేస్తే అందులో రూ. 25 కోట్లు విడుదల కాకుండా అడ్డుకుంటున్నది నిజం కాదా.. అని ప్రశ్నిం చారు. నియోజకవర్గ ప్రజలపై ప్రేమే ఉంటే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటే ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు తీసుకరావాలన్నారు. గ్రామాల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతిని ధులు తనను ప్రశ్నించడం మానుకుని, నియోజకవర్గానికి నిధులు రాకుండా అడ్డు పడుతున్న డిప్యూటీ సీఎంను నిలదీయాలని సూచించారు.