కేటాయింపులేవీ!
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు అంతగా ప్రాధాన్యం దక్కలేదు. విద్యుత్, వ్యవసాయం, పారిశ్రామిక, విద్యా, వైద్య, రహదారులకు ప్రయోజనం కలిగించే ప్రత్యేక ప్రయత్నం జరగకపోగా, మెడికల్ కళాశాలకు మళ్లీ మెండిచెయ్యే చూపారు. విద్యుత్, వ్యవసాయం, సాగు నీటి పథకాలకు భారీగా కేటాయింపులు జరుగుతాయని భావించినా, చివరకు నిరాశే మిగిలింది. ముఖ్యమైన ప్రాజెక్టులకూ మేలు చేకూరలేదు.
⇒ ఇందూరుకు అంతగా దక్కని ప్రాధాన్యం
⇒ ‘ప్రాణహిత-చేవెళ్ల’కు రూ.1,515 కోట్లు
⇒ నిజాంసాగర్ ఆధునీకరణకు రూ.89.50 కోట్లు
⇒ శ్రీరాంసాగర్ వరదకాల్వకు రూ.747 కోట్లు
⇒ ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ సంక్షేమ శాఖలకు తగ్గిన వాటా
⇒ విద్యుత్, వ్యవసాయంపై చిన్న చూపని విమర్శలు
⇒ రెండు పడక గదుల పక్కా ఇళ్లకు ఈసారి గ్రహణమే!
⇒ ప్రభుత్వ మెడికల్ కళాశాలకూ మొండిచేయే!
⇒ ‘ఈటెల’ బడ్జెట్‌పై రాజకీయ పక్షాల అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రముఖ ప్రాజెక్టులకు కూడా నిధులు రాకపోవడం నిరాశను కలిగించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలకూ సరిగా నిధులు సమకూర్చలేదు. వ్యవసాయ రంగాని కి ముఖ్యమైన ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టుల ఆధునీకరణకు ఆశించిన నిధులు కేటాయించలేదు. 15 ఎత్తిపోతల పథకాలకు ఈసారి బడ్జెటే లేదు. నిజాంసాగర్ ఆధునీకరణకు రూ.200 కోట్ల మేరకు అవసరం కాగా, రూ.89.50 కోట్లను కేటాయించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనా లు పెంచి ఊరట కల్పించారు. తెలంగాణ యూనివర్సిటీకి ప్ర ణాళికేతర వ్యయంలో రూ.28.29 కోట్లు మాత్రమే కేటారుుం చారు.ఈ ఏడాది రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి గ్రహ ణం పట్టినట్లే.
ఈ నిధులు ఏ మూలకు
‘డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు ఈ సారి బడ్జెట్‌లో రూ.1515 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ తో పోలిస్తే రూ.305 కోట్లు తక్కువ. ఇక్కడ నడుస్తున్న ప్యాకేజీ 20, 21, 22 కోసం రూ.800 కోట్లు అవసరం ఉండగా, కేవలం రూ.200 కోట్లు కూడ కేటాయించలేని పరిస్థితి. ఎస్‌ఆర్‌ఎస్‌పీ-1, ఎస్‌ఆర్‌ఎస్‌పీ నిర్వహణ కోసం గతేడాది రూ.85 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.110 కోట్లు ఇచ్చిం ది. లెండి ప్రాజెక్టుకు గతంలో రూ.3 కోట్లు కేటాయించి నిధు లు ఇవ్వకపోగా వాటిని కలుపుకొని రూ.5 కోట్లకు పెంచారు. నిజాంసాగర్ ఆధునీకరణ పనుల కోసం రూ.180 కోట్ల అవసరం ఉంటే ఈసారికి రూ.89.50 కోట్లకు తగ్గిం ది.
జిల్లా నుంచి కరీంనగర్‌కు విస్తరించిన ఇందిరమ్మ వరద కాల్వ నిర్మాణం కోసం గతంలో రూ.400 కోట్లు కేటాయించి రూ. 140 కోట్లే ఖర్చు చేయగా, ఈ సారి ఆ బడ్జెట్‌ను రూ. 747 కోట్లుగా ప్రకటిం చారు. రూ.10 కోట్లున్న చౌటపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతలకు గతేడాది రూ. కోటి ఇచ్చిన సర్కారు ఈ సారి రూ. రెండు కోట్లు ఇచ్చింది. అలీసాగర్, గుత్పలకు రూ. రెండు కోట్లు, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన సింగూరు ప్రాజెక్టుకు రూ.40 కోట్ల నుంచి రూ. ఏడు కోట్లకు కుదించారు.
సాగునీటి పథకాలకు అంతంతమాత్రంగానే నిధులు కేటాయించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 654 చెరువుల మరమ్మతులకు మొదటి విడతగా రూ.300 కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉందని అధికారపార్టీ నేతలు భావించగా,ఆ మేరకు నిధుల వాటా రా లే దు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌కు కేటాయిం చిన బడ్జెట్ ను చూస్తే జిల్లాకు అరకొ రగానే నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇందిర జలప్రభ, పావలా వడ్డీ, వడ్డీ లేని రుణం తదితర పథకాలపై పాత కేటాయింపులను ప్రభుత్వం బడ్జెట్‌లో వల్లె వేసి, ప్రధాన అంశాలను పక్కన బెట్టిందన్న భావన వ్యక్తమవుతోంది.
ప్రయోజనం ఏమిటో?
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దులో జిల్లాకు ప్రత్యక్షంగా చేకూర్చిన ప్రయోజనం ఏమీ లేదన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల కు కేటాయింపులు ప్రత్యక్షంగా జరగలేదంటున్నారు. లక్షల ఎకరాల సాగుకు నీరందించే లక్ష్యంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించామని ఆర్థిక మంత్రి ప్రకటించినా, జిల్లాలో సాగునీటి విధానం అభివృద్ధి చెం దాల్సిన అవసరం ఉంది. ఎత్తిపోతలు, ప్రాజెక్టులు, చెరువులు, రిజర్వాయర్లు, కుంటల ద్వారా పంటపొలాలకు నీరందించేందుకు కాల్వలను ఆధునీకరించా ల్సి ఉంది. ఎర్రజొన్న రైతులకు చెల్లించిన రూ. 13.5 కోట్లను ఈ బడ్జెట్‌లో ప్రస్తావించారు.
మెడికల్ కళాశాలకు రూ. 200 కోట్లు అవసరం ఉండగా వీటి ప్రస్తావన కూడా బడ్జెట్‌లో రాలేదు. 125 గజాల స్థ లంలో రూ.3.50 లక్షల వ్యయంతో రెండు పడక గదులతో పేదలకు పక్కాఇళ్లు నిర్మిస్తామన్న హామీ ఉండగా, బడ్జెట్ కేటాయింపుల ప్రకారం నియోజకవర్గానికి 250 ఇండ్లకు మించి వచ్చే అవకాశం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పసుపు పరిశోధన కేంద్రం, చక్కె ర కర్మాగారం పునరుద్ధరణ, గల్ఫ్ బాధితుల ప్రత్యేక విభాగం, వంగడాల పరిశోధన కేంద్రాలు తదితర హామీలు నెరవేర్చే అంశాలు కనిపించలేదు. మొత్తానికి ‘ఈటెల’ బడ్జెట్‌పై రాజకీయ పక్షాలు పెదవి విరుస్తున్నాయి. అంకెలగారడీగా అభివర్ణిస్తున్నారుు. జిల్లా ప్రజల నుంచి కూడా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.