ఈ నెల 12న ‘సాక్షి’లోవచ్చిన కథనం
సాక్షి, వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకాని జిల్లా అటవీశాఖ తూతూమంత్రంగా అమలుచేసిందని, 44వ జాతీయ రహదారి వెంట నాటిన చాలా మొక్కలు రక్షణ ఎండిపోయాయని, కానీ నిర్వహణ పేరిట ప్రజాధనం వృథాచేశారని ఈనెల 12న ‘సాక్షి’లో వచ్చిన ‘మొక్క.. తప్పు లెక్క! శీర్షికన వచ్చిన కథనానికి ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీశాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి ఆదేశించారు. జిల్లాలోని జాతీయ రహదారి వెంట 2016 సెప్టెంబర్‌లో రెండవ విడత హరితహరంలో భాగంగా 17వేల మొక్కలు నాటారు.
వాటి సంరక్షణ కోసం ఒక్కో మొక్కపై ప్రభుత్వం సుమారు రూ.600 ఖర్చుచేసింది. మొక్కలను నాటిన నుంచి వాటి సంరక్షణ బాధ్యతలను అటవీశాఖలోని ఐదుగురు సిబ్బంది బషీర్, సువర్ణమూర్తి, రవీందర్‌రెడ్డి, బాలరాజ్, రాజశేఖర్‌కు అప్పగించారు. మొక్కల్లో ఎదుగుదల లేదని ఫిర్యాదు అందుకున్న రాష్ట్ర అటవీశాఖ అధికారి డొబ్రియల్ పదినెలల క్రితం జిల్లాలో జాతీయ రహదారి వెంట నాటిన మొక్కలను పరిశీలించారు. బాధ్యులపై చర్య తీసుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారి ప్రకాశ్‌ను కోరారు. కానీ ఆయన పది నెలలు గడిచినా ఎలాంటి పురోగతి కనిపించలేదు.
పొంతనలేని మొక్కల లెక్కలు
ఈ విషయమై ‘సాక్షి’ పక్కా ఆధారాలతో ఈనెల 11న ‘మొక్కేశారు’ శీర్షికన కథనం వెలువడడంతో అప్రమత్తమై మాటమార్చిన ఫారెస్ట్ శాఖ జిల్లా అధి కారి 70శాతం మొక్కలు బతికే ఉన్నా యని లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చా రు. తిరిగి ఆయనే 11వేల మొక్కలను తిరిగి నాటేందుకు ఆర్డర్ ఇచ్చామని రెండు రకాల సమాధానం చెప్పారు.
దీనిపై స్పందించిన ‘సాక్షి’ జిల్లాలోని జాతీయ రహదారి వెంట 30శాతం మొక్కలు మాత్రమే బతికి ఉన్నాయని, అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారని కథనం వెలువరించింది. బాధ్యులైన సిబ్బంది నుంచి డబ్బును రికవ రీ చేయాల్సి ఉన్నా అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా ఈ విషయాన్ని మరుగున పడేయాలని చూశారు. కానీ విషయం తెలుసుకున్న అటవీశాఖ ప్రధాన కార్యదర్శి స్పందించడంతో బాధ్యుల్లో గుబులు మొదలైంది. ఇక మీదటైనా నిజనిజాలను బయటికి తీసుకురావాల ని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment