సాక్షి హైదరాబాద్ : తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 12వ రోజు నిరవరధికంగా కొనసాగుతోంది. ఈ సమ్మెకు మద్దతుగా రాష్ట్రంలోని పలు చోట్లలో ప్రతిపక్షాలు, వివిధ సంఘాల నాయకులు ర్యాలీలు, వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓయూలో తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్(టీఎస్‌ఎఫ్) భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆర్.కృష్ణయ్య, ప్రజా సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా :
ఆర్టీసీ సమ్మెలో భాగంగా కరీంనగర్ బస్‌స్టాండ్ చౌరస్తాలో కార్మికుల రాస్తారోకో. నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు కార్మికులు బిక్షాటన చేపట్టారు. కార్మికుల నిరసన ఆందోళనలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. వేములవాడ బస్టాండ్ ముందు కార్మికులు మానవహారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ ఆర్టీసీ ఉద్యోగి శిరోమండనం చేసుకొని మూల వాగులో కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి పిండ ప్రదానం చేశారు. సమ్మెకు మద్దతుగా అడ్వకేట్‌లు జేఏసీ ఉపాద్యాయులు, జేఏసీ నాయకుల సంఘీభావం తెలిపారు.
మరోవైపు సిరిసిల్ల డిపో నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు విద్యార్థి సంఘాల నాయకులు, ఆర్టీసి కార్మికులు ర్యాలీ నిర్వహించారు. గోదావరిఖని డిపో ముందు కార్మికుల నిరసన వ్యక్తం చేశరు. దీనికి సీపీఐ, సీపీఎం, అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. వేములవాడ పరిధిలోని నాంపల్లి వద్ద ప్రమాదం తప్పింది. అదే విధంగా కరీంనగర్ నుంచి వేములవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్ స్టీరింగ్ రాడ్ ఊడిపోయింది దీంతో డ్రైవర్ అప్రమవ్వడంతో 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఖమ్మం జిల్లా :
ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా 12వ రోజు వినూత్నంగా ఖమ్మం నగరంలోని అన్ని షాపుల ముందు కార్మికులు అర్ధనగ్నంగా భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఖమ్మం డిపో ముందు ధర్నాలో మాజీ పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరి పాల్గొని ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతు తెలిపారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను తయారుచేసి శవయాత్ర నిర్వహించారు. పాఠశాల తెరిపించి సమ్మెను విరమింప చేయాలని డిమాండ్ చేశారు. .కేసీఆర్ దిష్టిబొమ్మను కాల్చే కార్యక్రమంలో పోలీసులకు విద్యార్థి సంఘాల మరియు కార్మికుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
అదే విధంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముదిగొండ లో రాస్తారోకో చేపట్టారు. దీంతోపాటు కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన సెంటర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు బూర్గంపాడు మండలం అఖిలపక్ష నాయకులు తమ మద్దతు తెలిపారు.
మహబూబ్ నగర్ :
జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ చేప్టారు ఈ ర్యాలీకి ఉపాద్యాయులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలికారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై క్షవరం చేసుకుంటూ నిరసన వ్యక్తం చేశారు.
మెదక్ :
బస్టాండ్ నుంచి వెల్‌కమ్ బోర్డ్ వరకు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ, ఉపాధ్యాయ సంఘలు బైక్ ర్యాలీ నిర్వహించారు. దుబ్బాక బస్సు డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ తరపున టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, ఉపాధ్యాయ సంఘం టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి మద్దతు ప్రకటించారు. పెద్ద శంకరంపేట్ అక్కోలా రహదారిపై ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment