జగదేవ్‌పూర్/రేగోడ్ : వ్యవసాయమే సర్వస్వమని నమ్మిన రైతులకు వరుణుడు సహకరించలేదు. దీనికి తోడు పంట పెట్టుబడులు, ఇతర అవసరాలకు చేసిన అప్పులు ఏ ఏటికాయేడు పెరిగి పోతూనే ఉన్నాయి.. ఈ సారైనా పంట చేతికి వస్తుందని ఎదురు చూడడం తప్ప పంటలు మాత్రం పూర్తి స్థాయిలో అందడం లేదు. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగంటిపోవడం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోతున్నాయి.
దీంతో వాటిని చూస్తూ దిగులు చెందు తూ పలువురు ైరె తుల గుండెలు ఆగుతున్నాయి. సోమవారం కూడా జిల్లాలో ఇద్దరు రైతులు గుండెపోటుతో మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జగదేవ్ పూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బాలపోచయ్య (52) తనకున్న మూడెకరాల పొలంలో వరి, పత్తి పంటలను సాగు చేశాడు. అయితే వర్షాభావం, కరెంట్ కోతల కారణంగా వరి పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో పాటు పత్తి పంట కూడా ఎర్ర బడి పూర్తిగా ఎండిపోయింది. వీటికి తోడు కుమారుడు జహంగీర్ అనారోగ్యం పా ల్పడ్డాడు.
ఈ క్రమంలో పంట పెట్టుబడులు, కుమారుడి ఆరోగ్యం కోసం సుమారు రూ. 3 లక్షల మేర అప్పు చేశా డు. ఈ క్రమంలో అప్పు తీర్చాలని రుణదాతల నుంచి ఒత్తిళ్లు కూడా పెరిగాయి. దీంతో వారం రోజులుగా తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉండగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రామవ్వ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
రేగోడ్‌లో..
ఎండుతున్న పంటలను చూసి అప్పులు ఎలా తీర్చాలో దిగులు చెందుతూ ఓ కౌలు రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలం ఖాదిరాబాద్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు సోమవారం తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పల్లె రఫీయొద్దీన్ (30)కు తన రెండెకరాలతో పాటు మరో ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఇందులో పత్తి, వరి పంటలను సాగు చేశాడు.
అయితే ఆదివారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. అయితే నీరు లేక వరి పంట ఎండిపోవడం, పత్తి కూడా దిగుబడి వచ్చే సూచనలు కనిపించక కలత చెందాడు. ఈ సారి పంటలు సరిగా చేతికి వచ్చే పరిస్థితి కనపడడం లేదని, చేసి రూ. 3 లక్షల అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులతో చెప్పుకుని బాధపడ్డాడు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు గుండెపోటుకు గురయ్యాడు.
దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆటోలో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రఫీయొద్దీన్ మృతి చెందాడు. మృతుడికి భార్య నస్రీన్ బేగం, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. సర్పంచ్ రమేష్ జోషి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రేగోడ్ మండల ఆర్‌ఐ మర్రి ప్రదీప్ ఖాదిరాబాద్ గ్రామానికి వెళ్లి రఫీయొద్దీన్ మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతుడికి రూ.3 లక్షల వరకు అప్పులు ఉన్నాయని కుటుంబీకు లు, గ్రామస్తులు తెలిపారన్నారు.
ఎండిన పంటలు.. పగిలిన గుండెలు
Published Tue, Nov 11 2014 12:05 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement