హైదరాబాద్:నగరంలో సోమవారం ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బోరబండ వద్ద రైల్వే ట్రాక్ ను దాటుతుండగా తల్లీ కూతుళ్లు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జహీరాబాద్ కు చెందిన లింగమ్మ, తులసమ్మలు బంధువులు ఇంటికి వచ్చి తిరిగి పయనం అయ్యారు. ఈ క్రమంలోనే రైల్వే ట్రాక్ ను దాటే యత్నం చేయడంతో దూసుకొచ్చిన రైలు వారిని ఢీకొట్టింది. దీంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు.