రోడ్డు ప్రమాదంలో విద్యార్ధులకు గాయాలు
Published Mon, May 15 2017 11:17 AM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM
మేడ్చల్: వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని కొండాపూర్ వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
నగరంలోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన లోకేష్(22), లక్ష్మణ్(22) బైక్‌పై వెళ్తూ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement