ఓ వ్యక్తిని దుండగులు హత్య చేసి చెరువులో పడేశారు.
నర్సింహుల పేట (వరంగల్) : ఓ వ్యక్తిని దుండగులు హత్య చేసి చెరువులో పడేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సింహుల పేటలో ఆదివారం వెలుగు చూసింది. మండలంలోని కుమరికుంట్ల గ్రామ శివారులోని చెరువులో ఓ వ్యక్తి(40)ని దుండగులు హత్య చేసి పడేశారు.
ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా మృతుడి వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు.