కరీంనగర్ స్పోర్ట్స్ : విశ్వవిద్యాలయూలు విజ్ఞాన కేంద్రాలుగా రూపుదిద్దుకోవాల్సిన అవసరముందని ఉప ముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం శాతవాహన విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన పలు భవనాలను, నిర్మించబోయే పలు పనులను ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కడియం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఎకనామిక్ స్టాండర్డ్స్ పడిపోయాయని, విద్యార్థులు పరిశోధనలు చేయడం కనుమరుగయ్యాయని అన్నారు.
ఉన్నతమైన, నాణ్యమైన విద్యనందించే విశ్వవిద్యాలయాలు విద్యార్థుల భవిష్యత్‌కు పునాది కావాలని పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో సమస్యలు తెలుసుకునేందుకేృ ప్రారంభోత్సవానికి వచ్చానని, మరోసారి వచ్చినప్పుడు సమస్యలు లేకుండా చూస్తానని తెలిపారు. యూజీసీ గుర్తింపునకు కేంద్రంతో మాట్లాడతానని తెలిపారు. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాపరంగా దేశంలోనే మనరాష్ట్రం ముందుండాలనే లక్ష్యంతో అభివృద్ధికి పాటుపడాలన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం విద్యార్థులతోనే సాధ్యమన్నారు. డిగ్రీ పూర్తరుున విద్యార్థులకు ఉద్యోగమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, వచ్చే ఏడాది నుంచి కేజీ టు పీజీ విద్యను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్నామని తెలిపారు.
కేజీ టు పీజీపై త్వరలోనే అఖిలపక్షం, మేధావులు, ప్రొఫెసర్లు, అన్నివర్గాలవారితో విసృ్తతస్థారుులో చర్చించి విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో పదేళ్ల క్రితం విద్యావ్యవస్థ ఎలా అమలైందో ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని, ఖాళీలను భర్తీ చేయలేక అప్పటి ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ల పేరిట ఇష్టమున్నవారికి ఉద్యోగాలు కట్టబెట్టిందని విమర్శించారు. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయూరైందని, ఇన్నేళ్లు చేసినవారిని ఏం చేయూలనే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ విద్యకు కేటారుుంచే నిధులను ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు రెండే విశ్వవిద్యాలయూలుండగా, విద్యార్థుల పోరాటాలతోనే మరికొన్ని విశ్వవిద్యాలయూలు సాధించుకున్నామని, అందులో భాగంగానే శాతవాహన వచ్చిందని తెలిపారు. విద్యార్థులకు ప్రశ్నించేతత్వం తెలంగాణ మట్టితోనే వచ్చిందని అన్నారు. తెల్లరేషన్ కార్డులు, పెన్షన్‌లు ఇస్తేనే అభివృద్ధి కాదన్నారు. మేధా సంపత్తి కలిగిన వారు పాలకులుగా రావాలని, అప్పుడే మార్పు వస్తుందని పేర్కొన్నారు. మార్పును ఆలోచించే కేంద్రాలుగా విశ్వవిద్యాలయూలు మారాలన్నారు. సాంసృ్కతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీని తెలంగాణలో గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు కోసం త్వరలోనే కేంద్రంతో మాట్లాడతామని తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో వర్సిటీకి భారీగా నిధులు కేటారుుంచాలని డెప్యూటీ సీఎంను, ఆర్థికమంత్రిని కోరారు.
యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కడారు వీరారెడ్డి మాట్లాడుతూ 2008లో ప్రారంభమైన వర్సిటీ ఇప్పుడు కేవలం 63 మంది సిబ్బందితో పనిచేస్తోందని, ఖాళీలు భర్తీ చేయూలని కోరారు. కార్యక్రమంలో ఉన్నతవిద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, జేసీ పౌసమి బసు, ఎస్పీ శివకుమార్, మేయర్ సర్ధార్ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, జెడ్పీటీసీ శ్రీనివాస్, ఎంపీపీ వాసాల రమేశ్, రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిశోర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రూ.33 కోట్ల పనులకు...
యూనివర్సిటీలో రూ.13 కోట్లతో నూతనంగా నిర్మించిన అభ్యాస బాలుర వసతి గృహం, భోజన డైనింగ్‌హాల్, అక్షర గ్రంథాలయం, అక్షయ క్యాంటీన్ భవనాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఈటెల రాజేందర్ తదితరులు కలిసి ప్రారంభించారు. రూ.20 కోట్లతో నిర్మించనున్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భవనం, స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
ఎస్సారార్ ఎలా ఉంది?
తాను డెప్యూటీ సీఎంను, వరంగల్ జిల్లాకు చెందినవాడినైనా కరీంనగర్ జిల్లాలో తన అనుబంధం విడదీయరానిదని కడియం శ్రీహరి జిల్లా కేంద్రం లోని శ్రీరాజరాజేశ్వర (ఎస్సారార్) కళాశాలలో పనిచేసిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకున్నారు. 12 ఏళ్లపాటు జిల్లాలో ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా పనిచేశానని, అప్పట్లో రాష్ట్రంలో నే ఎస్సారార్ కళాశాల నంబర్‌వన్‌గా ఉండేదని, ఇప్పడు ఎలా ఉందోనని అన్నారు. అప్పుడు 76 మంది సిబ్బం ది ఉండేవారని, ఇప్పుడు ఎందరున్నా రో అని అనగానే... అక్కడే ఉన్న ఒక అధ్యాపకుడు ఇప్పుడు కూడా అంతే సిబ్బంది ఉన్నారని చెప్పారు. తాను రసాయనశాస్త్ర అధ్యాపకుడిగా చేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
విజ్ఞానకేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు
Published Mon, Feb 23 2015 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement
Advertisement