కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని 2016-17 సెలవుల్లోనూ పాఠశాల విద్యార్థులకు...
ఆదిలాబాద్ అర్బన్ : కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని 2016-17 సెలవుల్లోనూ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని సంయుక్త కలెక్టర్ సుందర్ అబ్నార్ జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో విద్యా శాఖఅధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ పాల్గొని మధ్యాహ్న భోజనం ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి నుంచి పదో తరగతి వరకు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. సమావేశంలో డీఈవో సత్యనారాయణరెడ్డి, డిప్యూటీ డీఈవో శ్యాం పాల్గొన్నారు.