‘గండ్ర’వి దివాళాకోరు రాజకీయాలు
కాంగ్రెస్‌లో ఉనికి కోసమే వెంకటరమణారెడ్డి ఆరోపణలు
తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైంది
టీఆర్‌ఎస్ జల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు
హన్మకొండ : భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు గండ్ర సత్యనారాయణరావు, గండ్ర వెంకటరమణారెడ్డి, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగంతో అక్రమాలకు పాల్పడిన గండ్ర వెంకటరమణారెడ్డి ఉనికి కోసం స్పీకర్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యాపారాల్లో లబ్ధి కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. గండ్ర వెంకటరమణారెడ్డి అక్రమ వ్యాపారాల గు రించి జిల్లా ప్రజలందరికీ తెలుసని, ఆయ న చేసిన విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హ యాంలో గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన అక్రమాలు, అవినీతి ఆయనకు ఇప్పుడూ గుర్తుకువస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశా రు.
తెలంగాణలో టీడీపీ ఎప్పుడో భూస్థాపితమైందని పేర్కొన్నారు. ఉనికిలేని టీడీపీకి జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాటల్లో వాస్తవాలు లేవని అన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా కాంగ్రెస్, టీడీపీలు కలిసి చేస్తున్న దుష్ర్పచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. స్పీకర్ మధుసూదనాచారి నిత్యం ప్రజలకు అందుబాటు ఉం టూ భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల కోసం కృషి చేస్తున్న స్పీకర్‌పై, స్పీకర్ కుటుంబంపై దిక్కుతోచని స్థితిలో ఇద్దరు నేతలు విమర్శలు చేస్తున్నారని అ న్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని, ప్రతిపక్ష నేతల మాటలను పట్టించుకోవడం లేదన్నారు.