హైదరాబాద్ నగరానికి ప్రత్యామ్నాయంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.
హైదరాబాద్ నగరానికి ప్రత్యామ్నాయంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసే యూనివర్సిటీలు, సంస్థలు, ఐటీ కంపెనీలు అన్నీ వరంగల్ జిల్లాకే వస్తాయని ఆయన చెప్పారు. వరంగల్ ప్రధాన రహదారులను 150 అడుగుల మేరకు విస్తరిస్తామన్నారు. వరంగల్ జిల్లా సమీక్షలో ఆయనీ వివరాలు వెల్లడించారు.
కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వీటికి ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో ఉన్న కాకతీయుల వారసులను కూడా ఆహ్వానిస్తామని కేసీఆర్ చెప్పారు. మైసూరు దసరా ఉత్సవాల తరహాలో కాకతీయ ఉత్సవాలు ఉంటాయన్నారు. పార్లమెంటులో ఝాన్సీ లక్ష్మీబాయి ఫొటో ఉన్నట్లే.. రాణి రుద్రమదేవి ఫొటో పెట్టాల్సిందిగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. మిషన్ కాకతీయ ప్రారంభానికి సూచికగా హన్మకొండ వడ్డేపల్లి చెరువు వద్ద పైలాన్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. మామూనూరు విమానాశ్రయం పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.