తెలంగాణకు79..ఏపీకి 69.34 టీఎంసీలు | Water Allocation For TS 79 TMCs And For AP 69.34 TMCs | Sakshi
Sakshi News home page

తెలంగాణకు79.. ఏపీకి 69.34 టీఎంసీలు

Published Wed, Oct 16 2019 3:50 AM | Last Updated on Wed, Oct 16 2019 3:50 AM

Water Allocation For TS 79 TMCs And For AP 69.34 TMCs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:ప్రస్తుత వాటర్‌ ఇయర్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగా ణ ప్రభుత్వాలు ఈ నెల 4 వరకు వినియోగించుకున్న నీటి లెక్కలను కృష్ణా బోర్డు తేల్చింది. రెండు రాష్ట్రాలు నీటి కేటాయింపులకు పంపిన ప్రతిపాదనలు.. ఇప్పటివరకు చేసిన కేటాయింపులను పరిగణనలోకి తీసుకుని, తక్షణ సాగు, తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 79 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 69.34 టీఎంసీలు ఇస్తూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

నవంబర్‌ వరకు సాగు, తాగునీటి అవసరాలకు 150 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ సర్కార్, 79 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డు కు ప్రతిపాదనలు పంపాయి. వీటిని పరిశీలించిన కృష్ణా బోర్డు.. ఇప్పటివరకు రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటి లెక్కలను తేల్చింది. ఈ నెల 4 వరకు శ్రీశైలం జలాశయం లో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 112.970 టీఎంసీలు, హంద్రీ–నీవా నుంచి 10.257, నాగార్జునసాగర్‌ కుడి కాలువ నుంచి 51, ఎడమ కాలువ నుంచి 10, కృష్ణా డెల్టాలో 59.510 వెరసి 232.654 టీఎంసీలు ఏపీ వినియోగించుకున్నట్లు లెక్క కట్టింది. తెలంగాణ ప్రభు త్వం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వ కుర్తి ఎత్తిపోతల ద్వారా 12.727 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ ఎడ మ కాలువ ద్వారా 18.22, ఏఎ మ్మార్పీ, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 16.141, మిషన్‌ భగీరథకు 1.358 మొత్తం 48.436 టీఎంసీలను వాడుకున్న ట్లు లెక్కకట్టింది.

రెండు రాష్ట్రాలు నీటి కేటాయింపులకు పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని, వినియోగించుకున్న జలాలపై ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన 335.840 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు తేల్చింది. ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసింది. ఏపీకి శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కు 3.03, హంద్రీ–నీవాకు 9.743, నాగార్జునసాగర్‌ కుడి కాలువకు 42.554, ఎడమ కాలువకు 5.529, కృష్ణా డెల్టాకు 8.49 వెరసి 69.348 టీఎంసీలను కేటాయించింది. తెలంగాణకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 15 టీఎంసీలు, సాగర్‌ ఎడమ కాలువకు 45, ఏఎమ్మార్పీకి 17, మిషన్‌ భగీరథకు 2 కలపి 79 టీఎంసీలను కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement