ఫాంహౌస్‌పై పోలీసుల దాడి: 30 మంది అదుపులోకి..
మొయినాబాద్: పోలీసులు ఓ ఫాంహౌస్‌పై దాడి చేసి అనుమతి లేకుండా బర్త్‌డే వేడుకలు నిర్వహిస్తున్న 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ రవిచంద్ర కథనం ప్రకారం.. శనివారం నగరానికి చెందిన సురబీ మల్లేష్ బర్త్‌డే. దీంతో అతడు తన స్నేహితుడు క్రాంతితో కలిసి అమ్డాపూర్ అనుబంధ నజీబ్‌నగర్ సమీపంలోని మల్లేష్‌యాదవ్ ఫాంహౌస్‌లో బర్త్‌డే పార్టీకి ఏర్పాట్లు చేశాడు.
30 మందితో కలిసి శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. డీజే పాటల హోరులో చిందులేస్తూ, హుక్కా పీల్చుతూ హంగామా చేస్తుండగా మొయినాబాద్ పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేశారు. అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ హుక్కా, డీజే ఏర్పాటు చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
హుక్కా, డీజేలను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో మద్యం లభించినప్పటికీ దానికి ఎక్సైజ్ అధికారుల అనుమతి ఉంది. అదుపులోకి తీసుకున్న యువకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి బర్త్‌డే పార్టీ నిర్వహణకు ఏర్పాట్లు చేసిన మల్లేష్, క్రాంతిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
అనుమతి లేకుండా బర్త్‌డే వేడుకలు
Published Sun, Jan 4 2015 2:54 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement