టీ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్
మంచిర్యాల: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పంట రుణాల మాఫీని ఆంక్షలు లేకుండా అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని నిషేధిత మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ సూచించారు. శనివారం ఆయన ‘న్యూస్‌లైన్’తో ఫోన్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎలా విస్మరిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన హామీలను బుట్టదాఖలు చేయాలని కుట్ర పన్నితే సహించేది లేదని.. రైతుల పోరాటాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. రైతులు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ అధికారంలోకి రాగానే తన వర్గ స్వభావాన్ని చాటుకున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడాన్ని తప్పు పట్టారు. తెలంగాణ, గిరిజన గ్రామాలను నీట ముంచి ఆంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు కుట్ర పన్నాయని ధ్వజమెత్తారు.
ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చే యాలి
Published Sun, Jun 8 2014 2:33 AM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM
Advertisement