నర్వ(మహబూబ్‌నగర్): కల్తీ కల్లుకు అలవాటుపడిన మహిళ కల్లు దొరకకపోవడంతో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం కొంకణివారిపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన బోయ బుచ్చమ్మ(48) గత కొంతకాలంగా కల్తీ కల్లుకు అలవాటు పడింది.
వారం రోజులుగా కల్లు లభించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తూ.. మంగళవారం రాత్రి వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవరారం నాడు ఆమె మృతిచెందింది.