భూదాన్‌పోచంపల్లి తెలంగాణలో స్వయం సహాయక సంఘాల పనితీరు, సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం చాలా బాగుందని పలు రాష్ట్రాలకు చెందిన అధికారుల బృం దం కొనియాడింది. హైదరాబాద్‌లోని జాతీ య గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్‌ఐఆర్డీ) ఆధ్వర్యంలో కర్నాటక, తమిళనాడు, ఒడిశా, హర్యానా, ఛత్తీస్‌గఢ్, అస్సాం, గోవా, గుజ రాత్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదే శ్, రాజ స్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన 20 మంది గ్రామీణాభివృద్ధి అధికారుల బృందం బుధవారం పో చంపల్లిని సందర్శించింది. మండల మహి ళా సమాఖ్య కార్యాలయంలో మహిళా సం ఘాలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించా రు.
సంఘాల ఏర్పాటు, సంఘంలో ఉండే సభ్యుల సంఖ్య, రికార్డుల నిర్వహణ, బ్యాం కుల ద్వారా తీసుకుంటున్న రుణాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకొం టున్నారో అడిగి తెలసుకున్నారు. అనంతరం పెద్దరావులపల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఐకేపీ నిర్వహణ ఎలా నిర్వహిస్తున్నారో ప్రత్యక్షంగా పరి శీలించారు. తాను కూడా ఓ మహిళా సం ఘంలో సభ్యురాలిగా ఉండి ప్రస్తుతం మం డల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యాయని సార సరస్వతీ తెలపడంతో అధికారులను ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ మిషన్ ఎగ్జిక్యూటివ్ స్వర్ణలత మాట్లాడు తూ ఎన్‌ఐఆర్డీలో గ్రామీణాభివృద్ధి-స్వ య ం ఉపాధిలో మహిళలు అనే అంశంలో శిక్షణ పొం దుతున్న అంతరాష్ట్ర అధికారుల బృందం తెలంగాణలోని మహిళా సంఘాలు, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేం ద్రాల నిర్వహణను అధ్యయనం చేయడాని కి క్షేత్ర పర్యట నిమిత్తం వచ్చారని తెలిపారు. కార్యక్రమంలో న్యూఢిల్లీ మిషన్ ఎగ్జిక్యూటివ్ సీమా భాస్క ర్, ఎంపీడీఓ గుత్తా నరేందర్‌రెడ్డి, ఏపీఎం హరినాయక్, ఏరియా కోర్డినేటర్ శ్రీని వా స్, క్లస్టర్ ఏపీఎం సుధారాణి, సీఆర్పీ ల క్ష్మి, సీసీ వసంత, సర్పంచ్ గుర్రం విఠల్, ఎంపీటీసీ సత్యనారాయణ పాల్గొన్నారు.
మహిళా సంఘాల పనితీరు భేష్
Published Thu, May 19 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM
Advertisement
Advertisement