ప్రొఫెసర్ కంచ ఐలయ్య రచించిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం వెనుక విదేశీ శక్తుల హస్తం, నిధులు ఉన్నాయని ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు టి.రామకృష్ణ ఆరోపించారు.
సీబీఐకి ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ ఫిర్యాదు
హైదరాబాద్: ప్రొఫెసర్ కంచ ఐలయ్య రచించిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం వెనుక విదేశీ శక్తుల హస్తం, నిధులు ఉన్నాయని ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు టి.రామకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ కోఠిలోని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కార్యాల యంలో ఆయన ఫిర్యాదు చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కంచ ఐలయ్య కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శిం చారు. ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి క్రిస్టియన్ అయినప్పటికీ అన్ని కులాలు, మతాలను సమానంగా చూశారని, హిందూ దేవతలను ఏనాడు కించపర చలేదని గుర్తుచేశారు. దేవాదాయ శాఖ అధీ నంలోకి వాసవి టెంపుల్స్‌ను తీసు కోకుండా, వైశ్యుల అధీనంలో ఉండాలని వాటిని అటానమస్ చేశారన్నారు.