
సుధీర్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
వైఎస్ఆర్ సీపీ యువజ విభాగం నేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.
వరంగల్ : వైఎస్ఆర్ సీపీ యువజ విభాగం నేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. గత నెల 23న సుధీర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు.